Chat GPT Alternatives: ఇక ఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో చాట్ జిపిటి ఒక సంచలనం.. దీని వినియోగం ప్రపంచ వ్యాప్తంగా మనదేశంలోనే ఎక్కువగా ఉంది. దాదాపు కోట్ల మంది దీనిని వాడుతున్నారు. అయితే ఇటీవల చాట్ జిపిటి లో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సేవలు పునః ప్రారంభమైనప్పటికీ..చాట్ జిపిటి విషయంలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఎదురు కాకూడదని లేదు కదా.. అప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి.. ముఖ్యంగా చాట్ జి బి టి మినహా మిగతా చాట్ బాట్లపై అంతగా అవగాహన లేని వారికి ఇది ఒకింత ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటప్పుడు చాట్ బాట్ కు సమానమైనవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యవసర సమయంలో ఇవి ఉపయోగపడతాయి.
గూగుల్ జెమిని
గూగుల్ జెమిని అనే చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జెమిని గూగుల్ యాప్స్ అన్నిటితోను అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వినియోగదారుడు ఉపయోగించే ఫోన్లోని అన్ని వ్యవస్థలతో అది అనుసంధానమై ఉంటుంది.. అంతేకాదు జిమెయిల్, google డాక్స్ లోని సమాచారం మొత్తాన్ని రిట్రీవ్ చేస్తుంది ఆ తర్వాత యూజర్లకు కావలసిన సహాయం మొత్తం చేస్తుంది.
ఎక్స్ ఐ గ్రోక్
మస్క్ కంపెనీ ఎగ్స్ రూపొందించిన చాట్ బాట్ గ్రోక్.. ఇది ఇతర ట్రెడిషనల్ చాట్ బాట్ లతో పరిశీలించి చూస్తే ఇది పూర్తిగా భిన్నమైనది. వెబ్ మాత్రమే కాకుండా ట్విట్టర్ లో ఉన్న సమాచారం ఆధారంగా చెప్పిన పనులు చేస్తుంది.. ట్విట్టర్లో ఇన్ఫర్మేషన్ తో పాటు.. ఇతర వాటితో కూడా ఈజీగా ఇంట్రాక్ట్ అవుతుంది.
మైక్రోసాఫ్ట్ కో పైలట్
దీని పేరులో ఉన్నట్టుగానే ఇది యూజర్లకు కావలసిన సమాచారాన్ని వెంటనే అందిస్తుంది.. ఎడ్జ్ బ్రౌజర్ లో అందుబాటులో ఉండడం దీని ప్రత్యేకత.. అంతేకాదు యూజర్ చూసే వెబ్ పేజీకి సంబంధించిన సమాచారం మొత్తం క్షణకాలంలో అందుబాటులోకి తీసుకొస్తుంది. క్లౌడ్ కోడింగ్ లో ఇది చేసే సహాయం మామూలుగా ఉండదు. కాదు ఇటీవల నిర్వహించిన పోటీలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఈ చాట్ బాట్ కు హాల్యూసి నేషన్స్ బాధ ఉండదు. నాచురల్ చాట్స్ అందివ్వడం దీని ప్రత్యేకత. సాధారణంగా సెర్చ్ ఇంజన్లలో మనకు కావలసిన సమాచారం త్వరగా లభిస్తుంది. కానీ ఇది అత్యంత ఫర్ ఫ్లెక్సీటిగా నెట్లో ఉన్న సమాచారాన్ని మొత్తం అందిస్తుంది. అయితే కచ్చితంగా సమాచారాన్ని అందివ్వడంలో ఇది ముందుంటుంది. ముఖ్యంగా రీసర్చ్ పేపర్లు, వెబ్ సైట్లు, రెడిట్ లాంటి వేదికలలో సమాచారాన్ని పూర్తిగా జల్లెడ పట్టి తీసుకోవచ్చు..
చాట్ జిపిటి మాదిరిగానే పై బాట్స్ మొత్తం పనిచేస్తాయి. కాకపోతే వీటి సేవలో అంతరాయం చోటుచేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే వీటికి సమర్థవంతమైన సర్వర్లు.. ఆధ్యాత్మికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యంత్రాంగం ఉంది. పైగా ఐటీ ఆధారిత సేవలు పై కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నాయి. వీటికి క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో విపరీతమైన అనుభవం ఉంది. కాకపోతే ఇవి భాగంలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ.. ఇవి అత్యద్భుతమైన సేవలను చేస్తున్నాయి. అందువల్లే ఇవి డౌన్ అయ్యే అవకాశం లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.