Mangli Birthday Party: టాలీవుడ్ లో ఫోక్ పాటలు పాడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మంగ్లీ.. తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుక సంచలనంగా మారింది. ఆ వేడుకలో విదేశీ మద్యం, మత్తు పదార్థాలు, ఇతర పరికరాలు కనిపించాయని పోలీసులు చెబుతున్నారు. పార్టీ జరిగిన చేవెళ్ల త్రిపుర రిసార్టు పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. దాడి చేసిన సమయంలో రిసార్ట్లో చాలామంది ఉన్నారు.. పైగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ హంగామా చేశారు.. ఆ సమయంలో స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసులు ఒక్కసారిగా రిసార్ట్ పై దాడి చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం.. విదేశీ మద్యం తీసుకురావడం.. అక్కడ మత్తు పదార్థాలు లభించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు .. రిసార్ట్ పై దాడి చేయడానికి వెళ్లిన పోలీసుల బృందంలో మహిళా ఎస్సై కూడా ఉన్నారు. రిసార్ట్లో జరిగిన వేడుకల్లో పదిమంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారందరూ కూడా మద్యం మత్తులో ఉండి డ్యాన్సులు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
” మంగ్లీ పుట్టినరోజు వేడుక జరుగుతుందని అక్కడ ఉన్న మేనేజర్ వెల్లడించారు. వేడుకకు అనుమతి తీసుకోలేదని మేనేజర్ వెల్లడించారు. అక్కడ జరుగుతున్న వ్యవహారంలో భారీగా విదేశీ మద్యం ఉంది. ఎక్సైజ్ నుంచి అనుమతి తీసుకోలేదు. ఇదే విషయాన్ని మేము గుర్తించాం. దీనిపై మంగ్లీని విచారిస్తే.. అనుమతి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇక డీజే ను ఆపరేట్ చేస్తున్న నీ వెంట మేనేజర్ మేఘరాజ్ ను అదుపులోకి తీసుకున్నాం. పార్టీలో పాల్గొన్న వారందరికీ నిర్ధారణ పరీక్షల నిర్వహించాం.. అందులో ఒకరు మత్తు పదార్థాలు తీసుకున్నట్టు తేలింది. మంగ్లీ అనుచరుడిగా ఉన్న దామోదర్ రెడ్డి మత్తు పదార్థాలు స్వీకరించినట్టు గుర్తించాం. దామోదర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. విచారణ చేసి పంపించాం. ఇక ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం ఉన్నట్టు గుర్తించాం. ఎటువంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ పై కేసుల నమోదు చేశాం. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై కూడా కేసులు నమోదు చేశాం. ఇక త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్ పై కూడా కేసు నమోదు చేశాం. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ సాగిస్తున్నామని” పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా వారు మీడియా ప్రతినిధులకు విడుదల చేశారు.
ఇక ఈ ఘటన తర్వాత యాక్టర్ దివి కూడా స్పందించారు. మీడియా ప్రతినిధులకు విడుదల చేసిన ఆడియోలో ఆమె ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు.” నా ఫోటోను కొన్ని మీడియా సంస్థలు అదేపనిగా చూపిస్తున్నాయి. ఒక స్నేహితురాలు తన పుట్టినరోజుకు ఆహ్వానిస్తే నేను ఆ పార్టీకి వెళ్లాను. స్నేహితురాలి హోదాలో మాత్రమే అక్కడికి వెళ్లాను. అంతేతప్ప నేను అక్కడ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడలేదు. అసలు అక్కడ జరిగిన దానితో నాకు సంబంధం లేదు. అనవసరంగా ఈ వివాదంలోకి లాగొద్దని” దివి స్పష్టత ఇచ్చింది.
Popular singer Mangli landed in a legal controversy as foreign #liquor and #Ganja were found at her birthday party held at a resort in #Chevella , outskirts of #Hyderabad
The police have booked a case against #Mangli and Resort General manager.
Reportedly Chevella Police… pic.twitter.com/hudTKBAbyR
— Surya Reddy (@jsuryareddy) June 11, 2025