Homeలైఫ్ స్టైల్Chandrayaan 3: జాబిల్లికి మరింత దగ్గరగా చంద్రయాన్_3

Chandrayaan 3: జాబిల్లికి మరింత దగ్గరగా చంద్రయాన్_3

Chandrayaan 3: చంద్రుడి గుట్టు మట్లు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3..జాబిల్లికి మరింత చేరువైంది.. మొన్ననే చంద్రుడి కక్ష్య లోకి ప్రవేశించిన చంద్రయాన్_3 ఇప్పుడు ఏకంగా జాబిల్లి ఉపరితలంలోకి మరింత చేరువైంది. బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ వ్యోమ నౌక చివరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఈ ఉపగ్రహం 153 కేఎం* 163 కేఎం వృత్తాకార కక్ష్యలో ఉన్నట్టు ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 17న ప్రపోల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోతుందని ఇస్రో ప్రకటించింది..23న ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కానుంది.

చంద్రయాన్_3 ప్రయోగం ద్వారా జాబిల్లి గురించి తెలుసుకునేందుకు మార్గం మరింత సుగమం అవుతోందని ఇస్రో సంబరపడుతోంది. యావత్ జాతి మొత్తం చంద్రుడి కక్ష్యలో దిగిన చంద్రయాన్_3 అప్డేట్స్ ను తీసుకునేందుకు ఎప్పటికప్పుడు ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 చంద్రుడి దక్షిణ ధ్రువం పైనే ప్రధానంగా దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులను, మానవ నివాసానికి యోగ్యంగా ఉంటాయా? అనే విషయాలను ప్రధానంగా చంద్రయాన్_3 అధ్యయనం చేస్తుంది. ఒకవేళ విలువైన లోహాలు గనక ఉండి ఉంటే అవి ఉపయోగపడతాయా? అనే కోణంలో కూడా అది పరిశీలనలు జరుపుతుంది.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్_3 ఇటీవలే భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య లోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి చంద్రయాన్_3 చంద్రుడి కక్ష్యలో 18 రోజులపాటు ఉంది. అనంతరం ఉపరితలం మీద స్పేస్ క్రాఫ్ట్ లో విక్రమ్ ల్యాండర్ దిగింది. చంద్రుడి దక్షిణ దృవం పై పరిశోధనలు చేస్తోంది. చంద్రయాన్_3 చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. చంద్రయాన్_2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్_3లోని విక్రమ్ ల్యాండర్ కు ఇదే ప్రధానమైన తేడా. గతంలోనే చంద్రయాన్_2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొట్టింది. దీంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు మొత్తం పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు లాండర్ ను మరింత అభివృద్ధి చేసి జాబిల్లి మీదికి పంపారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular