Phone Numbers Blocked : ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏకంగా 55 లక్షల ఫోన్ నంబర్లు బ్లాక్..

ఈ ప్రయత్నం ఫలించిన నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని నంబర్లపై దృష్టిపెట్టి.. వాటిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : December 18, 2023 3:36 pm
Follow us on

Phone Numbers Blocked : భారత ప్రభుత్వం అసాంఘిక శక్తులు, మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఫోన్‌ నంబర్లపై చర్యలకు దిగింది. ఒకటి రెండు కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి నంబర్లు 55 లక్షలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నంబర్లతో దేశ ద్రోహంతొపాటు, సామాన్యులను మోసం చేసేందకు, సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు ధ్రువీకరించింది. వీటిని బ్లాక్‌ చేయాలని నిర్ణయిచింది. 5.5 మిలియన్ల ఫోన్‌ నంబర్లను డీయాక్టివేట్‌ చేసింది.

సంచార్‌ సాథీ పోర్టల్‌ ద్వారా..
చట్టవిరుద్ధమైన సిమ్‌ కార్డ్‌లతో సంబంధం ఉన్న సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు కేంద్రం సంచార్‌ సాథీ పోర్టల్‌ ప్రారంభించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించిన ధ్రువీకరణ ప్రచారం విజయవంతమైందని కమ్యూనికేషన్ల మంత్రి దేవుసిన్‌ చౌహాన్‌ వెల్లడించారు గుర్తించిన కనెక్షన్లను డీయాక్టివేషన్‌ చేసింది.

ఫోన్లు కూడా బ్లాక్‌..
ఈ నంబర్లతోపాటు సైబర్‌ క్రై మ్, ఆర్థిక మోసాలకు పాల్పడిన 1.32 లక్షల హ్యాండ్‌సెట్‌లను ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. అదనంగా, అణిచివేతలో భాగంగా 13.42 లక్షల అనుమానాస్పద కనెక్షన్లు డిస్‌కనెక్ట్‌ చేసింది. సమస్యను మరింత పరిష్కరించడానికి, ప్రభుత్వం వారి మొబైల్‌ కనెక్షన్ల గురించి ప్రజలకు తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి వినియోగదారుల అవగాహన ప్రచారం కూడా ప్రారంభించింది.

ప్రభుత్వ ప్రయత్నం విజయవంతం..
సైబర్‌ సెక్యూరిటీని పెంపొందించడానికి, మోసపూరిత ఫోన్‌ నంబర్లు పనిచేయకుండా చేయడానికి కేంద్రం చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ఈ సమగ్ర ప్రయత్నం ద్వారా 55 లక్షల ఫోన్‌ నంబర్లను బ్యాన్‌ చేయడం ద్వారా నేరాలు తగ్గుతాయని భావిస్తోంది. ఈ ప్రయత్నం ఫలించిన నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని నంబర్లపై దృష్టిపెట్టి.. వాటిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.