Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్-ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడ్డారు. అత్యధిక ఓట్లు పొందిన ప్రశాంత్ ని హోస్ట్ నాగార్జున విన్నర్ గా ప్రకటించారు. టైటిల్ రేసులో శివాజీ, అమర్, ప్రశాంత్ పేర్లు వినిపించాయి. శివాజీ, అమర్ కంటే పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడని పలు సర్వేలు నిర్ధారించాయి. ఫైనల్ రిజల్ట్ కూడా అదే వచ్చింది. ఇక ఫినాలే కలర్ఫుల్ గా గ్రాండ్ గా సాగింది. స్టార్స్ సందడి చేశారు. నిధి అగర్వాల్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. రవితేజ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, సుమ కనకాల వేదికపై అలరించారు.
ముఖ్యంగా ఎలిమినేటైన మాజీ కంటెస్టెంట్స్ తో నాగార్జున సంభాషణలు ఆసక్తి రేపాయి. బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందని ఒక్కొక్కరినీ నాగార్జున అడిగారు. చాలా బాగుంది. తమకు ఆఫర్స్ పెరిగాయని, కెరీర్ ఊపందుకుందని చెప్పారు. టేస్టీ తేజాకు 15 సినిమా ఆఫర్స్ వచ్చాయంట. బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఈ ఆరు వారాల్లో సంపాదించానని తేజ ఓపెన్ గా చెప్పాడు. శుభశ్రీ తనకు పవన్ కళ్యాణ్ ఓజీలో ఆఫర్ వచ్చిన విషయం వెల్లడించింది.
ఇలా ప్రతి ఒక్కరూ ఆఫ్టర్ బిగ్ బాస్ తమ జీవితాలు ఎలా ఉన్నాయో తెలియజేశారు. ఈ మాజీ కంటెస్టెంట్స్ కి నాగార్జున ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. హౌస్లో వాళ్ళ ప్రవర్తన ఆధారంగా కొన్ని ఫన్నీ అవార్డ్స్ ఇచ్చాడు. అవేంటో చూద్దాం. సింగర్ దామినికి పిడకల అవార్డు ఇచ్చారు. నయని పావనికి ఇన్స్టంట్ న్యూడిల్స్ అవార్డు ఇచ్చారు. వాటర్ బాటిల్ అవార్డు పూజ మూర్తి ఇవ్వడం జరిగింది.
రెడ్ లిప్స్టిక్ శుభశ్రీకి ఇచ్చారు. ఉడుత అవార్డు రతిక రోజ్ కి ఇచ్చాడు. ఇక సంచాలక్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఆట సందీప్ కి ఇచ్చాడు. గోల్డెన్ మైక్ అవార్డు భోలే షావలీకి ఇచ్చారు. టిష్యు పేపర్ అవార్డు అశ్వినికి , డంబెల్ అవార్డు గౌతమ్ కి ఇచ్చాడు. ఈ అవార్డు నవ్వులు కురిపించాయి. కిరణ్ రాథోడ్, షకీలా ఫైనల్ కి హాజరుకాలేదు. ఇక శివాజీ మూడో స్థానంలో నిలిచారు. యావర్ నాలుగు, ప్రియాంక ఐదు, అర్జున్ 6వ స్థానం కైవసం చేసుకున్నారు.