Bombay High Court: ఇద్దరు భార్యల ముద్దుల మొగుళ్లకు ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫస్ట్ భార్యకు ఉన్న ప్రయారిటీ సెకండ్ భార్యకు ఉండదనుకుంటే ఇక చెల్లదు. సెకండ్ కదా అని చిన్న చూపు చూడడం ఇకపై కుదరదు. భార్య ఫస్టా, సెకండా అన్నది ముఖ్యం కాదు. భార్య అవునా కాదా అన్నదే ముఖ్యమట. ఇద్దరు భార్యలున్నప్పుడు … ఏదైన మనస్పర్ధల కారణంగా విడిపోవాల్సి వచ్చినప్పుడు రెండో భార్య కూడా భరణం ఇవ్వాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు నెలవారీ ఇచ్చే భరణాన్ని పెంచేందుకు పిటిషన్ దాఖలు చేసుకొనే అవకాశం కూడా రెండో భార్యకు ఉంటుందని బాంబై హైకోర్టు తెలిపింది.
ఎనిమిదేళ్ల విచారణ తర్వాత..
నాసిక్ జిల్లా యోలా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 2015 లో ఓ మహిళకు ( రెండో భార్య) తన భర్త ఆదాయాన్ని పరిశీలించి.. ఆమెకు రూ, 2,500 భరణాన్ని ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. ఆ వ్యక్తి నిఫాద్‌లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశాడు. 2022, ఏప్రిల్‌లో సెషన్స్ కోర్టు కింది కోర్టు ఉత్తర్వులు రద్దు చేసింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై సదరు మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకు 1989లో వివాహం అయిందని.. తమ దాంపత్య జీవితంలో 1991లో మగబిడ్డ జన్మించాడని తెలిపింది. అంతకు ముందే నా భర్తకు వివాహం అయిందని.. అయితే మొదటి భార్యకు సంతానం కలగనందున చట్టపరంగా విడిపోయామని చెప్పి తనను నమ్మించడంతో వివాహం అయిన వ్యక్తిని పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించినట్లు పిటిషన్‌లో వివరించింది.
మొదటి భార్యతో సహజీవనం..
తనకు పెళ్లయిన రెండేళ్లకు మధ్యవర్తుల జోక్యంతో తన భర్త మొదటి భార్యతో సహజీనవం ప్రారంభించారని..అప్పుడు ( మొదటి భార్యకు) ఒక కొడుకు పుట్టాడని పిటిషన్‌లో తెలిపింది. తరువాత తనకు కూడా మరల ఇంకొక కుమారుడు కలిగాడని.. పాఠశాల రికార్డులలో ఆ వ్యక్తి పేరునే తండ్రి పేరుగా నమోదు చేయించినట్లు పేర్కొంది. రెండో కుమారుడు పుట్టిన తరువాత ఆ తరువాత మరస్పర్థలు వచ్చాయని తెలిపింది. 2011 వరకు కోర్టు ఉత్తర్వలు భరణం పొందానని తరువాత మొదటి భార్య ప్రోద్భలంతో భరణం ఇవ్వడం ఆపేశాడని బాధితురాలు హైకోర్టుకు విన్నవించింది.
సెషన్స్ కోర్టు ఉత్తర్వులు రద్దు..
ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు సెషన్స్ కోర్టు ఉత్తర్వులను రద్దుచేసింది.. తొమ్మదేళ్లుగా చెల్లించాల్సిన బకాయిలను రెండు నెలలలోగా క్లియర్ చేయాలని ఆదేశించింది. రెండో భార్య అయినా విడిపోయినప్పుడు భరణం ఇవ్వాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. భరణం పెంచేందుకు మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకొనే అవకాశం కూడా రెండో భార్యకు బాంబే హైకోర్టు కల్పించి భర్తకు షాక్‌ల మీద షాక్ ఇచ్చింది.