Israel-Hez Bolla : ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ పేరు మొస్సాద్. అది ఎలాంటి ఆపరేషన్ అయినా చేపడుతుంది. లిప్తపాటు కాలంలోనే టార్గెట్ ఫినిష్ చేస్తుంది. చాలామంది ప్రపంచంలో అత్యంత సీక్రెట్ ఆపరేషన్లు అమెరికా నిఘా విభాగం సీఐఏ చేపడుతుందని భావిస్తుంటారు. కానీ మొస్సాద్ చేసిన ఆపరేషన్లు ఇంతవరకు సిఐఏ కూడా చేసి ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా మొస్సాద్ కు నెట్వర్క్ ఉంది. అలాంటి మొస్సాద్ ఇప్పుడు తమ దేశానికి పంటికింద రాయిలాగా మారిన హెజ్ బొల్లా ను టార్గెట్ చేసింది. దానికి ఆపలేని యుద్ధాన్ని ఇస్తోంది. ఇటీవల పేజర్లు పేల్చి సంచలనం సృష్టించిన మొస్సాద్.. ఇప్పుడు ఒక్కొక్క అస్త్రాన్ని బయటకి తీస్తోంది.. పేజర్ల విషయాన్ని మర్చిపోకముందే బుధవారం డజన్లకొద్దీ వాకీ టాకీలను.. ఇతర సోలార్ ఎక్విప్మెంట్స్ ను బద్దలు కొట్టింది. దీంతో హెజ్ బొల్లా శ్రేణులు వణికి పోతున్నాయి. అయితే ఈ ఆపరేషన్లలో మొస్సాద్ మాత్రమే కాకుండా ఇజ్రాయిల్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ “యాహిద షమోనే మతాయిమ్” అలియాస్ యూనిట్ 8200 ఉంది.
అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, బ్రిటన్ లోని జిసిహెచ్ క్యూ కు ఎంతటి శక్తిసామర్థ్యాలు ఉన్నాయో.. ఇజ్రాయిల్ యూనిట్ 8200 కి కూడా అదే స్థాయిలో శక్తి యుక్తులు ఉన్నాయి. ఇజ్రాయిల్ యూనిట్ 8200 విభాగం సమాచారాన్ని విస్తృతంగా సేకరిస్తుంది. సైబర్ డిఫెన్స్ కోసం సమర్థవంతంగా పనిచేస్తుంది. దానికి కావలసిన పరికరాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటుంది. అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తో కలిసి యూనిట్ 8200 చాలాసార్లు పనిచేసింది. యూనిట్ 8200 అత్యంత ప్రతిభావంతులను మాత్రమే తీసుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం పై పట్టు ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇస్తారు.. హై స్కూల్ స్థాయిలోనే వారిని గుర్తించి ఎంచుకుంటారు. వారికి హ్యాకింగ్, ఎన్క్రిప్షన్, నిఘా వంటి సంక్లిష్టమైన అంశాలలో శిక్షణ ఇస్తారు. కొన్ని పనులు అప్ప చెబుతారు. వాటిని పూర్తి చేసిన వారికే అందులో అవకాశం కల్పిస్తారు. ఇరాన్ దేశంలో అణు కేంద్రాన్ని యూనిట్ 8200 లో పనిచేసిన వారే సర్వనాశనం చేశారు.. దాని సెంట్రిఫ్యూజ్ లు మొత్తం ధ్వంసం చేశారు. ఇక ఇందులో పనిచేసిన వారికి ఇజ్రాయిల్ దేశంలోనే హైటెక్ కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తాయి. సరికొత్త ఆవిష్కరణలు చేస్తే అంతకుమించి అనేలాగా వేతనాలు ఇస్తాయి. కాగా, హెజ్ బొల్లా కు ఇజ్రాయిల్ చూపించింది శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. అంటే ఇంకా ఎన్ని రకాలుగా దాడులు చేసేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Attack on hezbollah by israeli secret agency name mossad and yahida shamone mataim alias unit 8200
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com