Deepika Pilli: దీపికా పిల్లి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పటి ఈ సోషల్ మీడియా స్టార్ యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. విజయవాడలో 1999లో పుట్టిన తెలుగు అమ్మాయి దీపికా పిల్లి.. టిక్ టాక్ వేదికగా డబ్స్మాష్ వీడియోలు చేసేది. సదరు వీడియోలకు విపరీతమైన ఆదరణ దక్కింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో నెటిజెన్స్ ని ఆకట్టుకుంది. టిక్ టాక్ లో దీపికా పిల్లికి ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవారు. అయితే టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ఆరంభించింది.
దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో 2 మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఇది ఒక హీరోయిన్ రేంజ్ పాపులారిటీ. 2021లో ఆమెకు యాంకర్ గా ఆఫర్ వచ్చింది. పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ కింగ్స్ వెర్సెస్ క్వీన్ కి దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరించింది. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సైతం యాంకర్స్ గా ఉన్నారు. రష్మీ-సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి-హైపర్ ఆది రెండు జంటలుగా ఏర్పడి కెమిస్ట్రీ కురిపించారు.
అయితే నెక్స్ట్ సీజన్ లో ఆమెకు ఛాన్స్ రాలేదు. దీపికా పిల్లిని తప్పించారు. అనంతరం స్టార్ మాలో ప్రసారమైన కామెడీ స్టార్స్ ధమాకా సీజన్ 2కి యాంకర్ గా వ్యవహరించింది. అలాగే ఓటీటీలో కొన్ని షోలకు ఆమె యాంకరింగ్ చేసింది. దీపికా పిల్లి సినిమా ఛాన్స్ సైతం పట్టేసింది. వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఆమె నటించారు. ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, అనసూయ ప్రధాన పాత్రలు చేశారు. వాంటెడ్ పండుగాడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
కారణం తెలియదు కానీ దీపికా పిల్లి బుల్లితెరకు దూరమైంది. ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఆమె తరచుగా టచ్ లో ఉంటున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో నెటిజెన్స్ కి నాన్ స్టాప్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.
ఎక్కడో విదేశాల్లో విహరిస్తున్న దీపికా పిల్లి ఓ అందమైన ఫోటో షూట్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సదరు ఫోటో షూట్ పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Web Title: Deepika pilli is the young anchor who is giving the boy a no nonsense look
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com