Social media status: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ వాడకం ఎక్కువైపోయింది. ప్రతి పనిని చాలామంది మొబైల్ ద్వారా చేస్తున్నారు. కొందరు ఉద్యోగం, వ్యాపారం చేయడానికి కూడా ఫోన్ ను ప్రధానంగా చేసుకుంటున్నారు. ఇలా మొబైల్ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఫోన్ ను మంచి కోసం వాడుకుంటే ఎన్నో రకాలుగా బాగుంటుందని.. చెడు కోసం వాడుకుంటే అనేక రకాలుగా నష్టాలను కలిగిస్తుందని ఇప్పటికే కొందరు సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగానే సైబర్ నేరగాళ్లు ఫోన్ ద్వారా అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా కొన్ని రకాల ఆకర్షించే యాప్స్ ను వాడుకుంటూ వినియోగదారుల పర్సనల్ డేటాను చోరీ చేస్తున్నారు. అది ఎలా అంటే?
ఉదయం లేవగానే మొబైల్ చూడడం చాలామందికి అలవాటు. అంతేకాకుండా స్టేటస్ లో ఏదో ఒక పిక్ పెట్టుకోవడం.. లేదా హాయ్.. గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టడం వంటివి చేస్తుంటాను. ఇక ఇటీవల ట్రెండ్ అవుతున్న ఇంస్టాగ్రామ్ లో అయితే ప్రతి విషయాన్ని షేర్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో ఉన్న యాప్స్ ద్వారా బయట పెడుతున్నారు. అయితే వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల గూగుల్ జెమినీ కి సంబంధించిన యాప్స్ ట్రెండీగా మారిపోయాయి. ఇందులో ఒక ఫోటో అప్లోడ్ చేస్తే మనం ఎలా కావాలంటే అలా త్రీడి ఇమాజినేషన్ క్రియేట్ అవుతుంది. దీనిని ఇటీవల చాలామంది స్టేటస్ లో పెట్టుకున్నారు.
అయితే ఈ త్రీడీ ఇమాజిన్ ద్వారా పర్సనల్ డేటా లీక్ అవుతుందని కొందరు పోలీసులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ గైడ్లైన్స్ ప్రకారం ఒక వ్యక్తి డాటా సేకరించడానికి ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో ఎవరి ఫోటోలు అయితే అప్లోడ్ చేస్తారో వారికి సంబంధించిన ఫేస్ రికగ్నైజేషన్ డేటా లీక్ అవుతుందని.. దీంతో ఆధార్, ఇతర కార్డులకు సంబంధించిన డేటా సైబర్ నేరగాళ్లకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అందువల్ల సోషల్ మీడియాలో ఎటువంటి పర్సనల్ ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చాలామంది తాము ఎక్కడికి వెళ్ళేది కూడా స్టేటస్ లో ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. ఇది దొంగలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని.. జాగ్రత్తలు చెబుతున్నారు. పర్సనల్ విషయాలు, కుటుంబ సభ్యుల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా ఉండడమే మంచిదని అంటున్నారు. ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారం కోసం అయితే నేరుగా సంప్రదింపులు జరపాలని.. ఆన్లైన్ వ్యవస్థను నమ్ముకోవద్దని అంటున్నారు. ఎందుకంటే crypto కరెన్సీ పేరిట ఇటీవల చాలా మోసాలు జరుగుతున్నాయని.. తక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. ఎక్కువ లాభాలు వస్తున్నాయని నమ్మించి మోసం చేస్తున్నారని అంటున్నారు. వీటన్నిటికీ సోషల్ మీడియాని కారణమని అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియాలో పర్సనల్ డేటాను ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయకపోవడమే మంచిది అని తెలుపుతున్నారు.