WhatsApp Messages AI: శాస్త్ర సాంకేతిక రంగాలు సరికొత్త విధానాలలో అభివృద్ధి చెందుతున్నాయి.. కొత్త కొత్త ఆవిష్కరణలు మనిషి జీవితాన్ని అత్యంత సుఖవంతం చేస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి ద్వారా తీసుకొచ్చిన సరికొత్త ఆవిష్కరణలో వాట్సప్ ఒకటి. మొదట్లో ఇది సందేశాలకు, ఫోటోలకు మాత్రమే పనికి వచ్చేది. ఆ తర్వాత అనేక రకాలుగా మార్పులకు గురైంది. వీడియోల నుంచి మొదలు పెడితే పిడిఎఫ్ ఫైల్స్ వరకు వాట్సప్ ద్వారానే పంపడానికి సాధ్యమవుతున్నది.
Also Read: టైమ్స్ నౌ – జేవీసీ సర్వే: బీహార్లో గెలుపు ఎవరిదంటే?
కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత..
కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సప్ సమూల మార్పులకు గురైంది. మెటా కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో వాట్సాప్ విభిన్నంగా కనిపిస్తోంది.. అయితే వాట్సాప్ లో తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఆప్షన్ ను ఎనేబుల్ చేస్తే ఆ గ్రూపులోని సందేశాలను కృత్రిమ మేధ చదివేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీటికి సంబంధించి ట్విట్టర్ ఎక్స్ లో విస్తృతమైన చర్చ జరిగింది. ఇదే విషయాన్ని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ సైతం పేర్కొన్నారు.
గ్రోక్ ఏమన్నదంటే..
ట్విట్టర్లో కృత్రిమ మేధకు సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో గ్రోక్ ను చాలామంది ఈ ప్రశ్నను అడిగారు. అయితే దీనిపై గ్రూప్ తనదైన శైలిలో సమాధానం చెప్పింది.. మెటా ఏఐ ని ట్యాగ్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటిది జరుగుతుందని.. గ్రూపులలో ప్రత్యేకమైన అంశాలను మెటాకు ట్యాగ్ చేస్తే పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చని.. నిజాలను కూడా రూడీ చేసుకోవచ్చని చెబుతోంది..”ఇలాంటి చర్చ అర్ధ రహితం. వాస్తవానికి అనుమాన పడింది ఏదీ జరగదు. ఎందుకంటే అలాంటి అవకాశం లేదు. కృత్రిమ మేధ అనేది సరికొత్త సాంకేతిక అనుభూతికి మాత్రమే పనికి వస్తుంది. అంతేతప్ప వ్యక్తిగత గోప్యత కు భంగం కలిగించదని” గ్రోక్ వెల్లడించింది.
ఇటీవల కాలంలో వాట్సాప్ లో కూడా కృత్రిమ మేధ వాడకం ఎక్కువైంది. మనం అనుకున్న ఫోటోలను.. వీడియోలను.. ఇతర విషయాలను మెటా రూపొందించిన కృత్రిమ మేధ తెలియజేస్తోంది. అయితే వాస్తవానికి ఇది దూరంగా ఉండడంతో.. మార్పులు చేర్పులు చేయాలన్న డిమాండ్ నెటిజన్ల నుంచి వినిపిస్తోంది.. అందువల్లే మెటా కంపెనీ భారీ ఎత్తున పెట్టుబడితో సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. త్వరలో సరికొత్త సాంకేతిక అనుభూతి కలుగుతుందని నెటిజన్లకు భరోసా ఇస్తోంది.