Bihar Election 2025 Survey: దేశ రాజకీయాలను పక్కనపెట్టి.. బీహార్ రాష్ట్రంలో చావో రేవో తేల్చుకోవడానికి రాహుల్ గాంధీ ఏకంగా అక్కడే ఆయన తిష్ట వేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధానంగా ఆ రాష్ట్రాన్ని ఫోకస్ చేశారు. ఆ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఆయన పట్టుదల సాధ్యమవుతుందా.. ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా.. అనే ప్రశ్నలకు “టైమ్స్ నౌ – జేవీసీ” సమాధానం చెప్పింది.
Also Read: ఓడిపోయినోడ్ని ‘అగ్నిపరీక్ష’ కి జడ్జిగా పెడతారా..? నవదీప్ పై రెచ్చిపోయిన కౌశల్!
బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గడిచిన రెండు పర్యాయాలు ఇక్కడ ఏక పార్టీ ప్రభుత్వం ఏర్పడలేదు. ఏ పార్టీకి కూడా బీహార్ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టలేదు.. మొదట్లో కాంగ్రెస్, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఆ కూటమిలో చీలికలు, పీలికలు ఏర్పడడంతో నితీష్ కుమార్ కు బిజెపి సపోర్ట్ ఇచ్చింది.. దీంతో అక్కడ బిజెపి, నితీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా ఇదే కూటమి పోటీ చేస్తోంది. ఇప్పటికే సీట్ల పంపకం పూర్తయిందని తెలుస్తోంది.
గెలిచేది ఆ పార్టీనే
టైమ్స్ నౌ, జేవీసీ సర్వేలో ఎన్డీఏ కు బీహార్ రాష్ట్రంలో 136 స్థానాలు వస్తాయని తేలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో మహా గట్ బంధన్ 75 స్థానాలకే పరిమితమవుతుందని తేలింది. ఇందులో ఆర్ జె డి కి 52, కాంగ్రెస్ పార్టీకి పై స్థానాలు వస్తాయని పేర్కొంది.. గడచిన ఎన్నికలతో పోల్చి చూస్తే ఆర్జెడీకి 23, కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు తగ్గుతాయని టైమ్స్ నౌ సర్వేలో తేలింది.
సర్వే ఎప్పుడు చేశారంటే..
ఈ సర్వే జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్యలో చేశామని టైమ్స్ నౌ పేర్కొంది. ఇక ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల జరిగితే ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయని తేలింది. ఇందులో భారతీయ జనతా పార్టీకి 260 స్థానాలు వస్తాయని స్పష్టమైంది. గడచిన పార్లమెంటు ఎన్నికల కంటే ఈసారి బిజెపికి స్థానాలు పెరుగుతాయని ఇండియా టుడే పేర్కొంది. వచ్చేసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన బలం (272) దక్కుతుందని పేర్కొంది. ఇక ఇండికూటమికి 208 స్థానాలు మాత్రమే లభిస్తాయని వెల్లడించింది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 543 స్థానాలకు బీజేపీ 240 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 32 స్థానాలను మిత్రపక్షాల నుంచి భర్తీ చేసుకుంది.. ఇక ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ద్వారా బిజెపి తిరిగి పూర్వశక్తిని సంతరించుకుంది. ఇండియా టుడే ఈ సర్వే ను జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు నిర్వహించింది. అన్ని పార్లమెంటు స్థానాలలో 54,788 మంది అభిప్రాయాలను సేకరించింది.