https://oktelugu.com/

యాపిల్ కంపెనీ శుభవార్త.. రూ. 5 వేల క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్..?

యాపిల్‌ స్టోర్‌ మన దేశంలోని వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఆన్ లైన్ లో 44,900 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం ఆర్డర్ చేసేవాళ్లకు 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఆఫర్ ప్రారంభం కానుంది. 28వ తేదీలోపు యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవాళ్లు క్యాష్ బ్యాక్ ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 16, 2021 / 03:55 PM IST
    Follow us on

    యాపిల్‌ స్టోర్‌ మన దేశంలోని వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఆన్ లైన్ లో 44,900 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం ఆర్డర్ చేసేవాళ్లకు 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఆఫర్ ప్రారంభం కానుంది. 28వ తేదీలోపు యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవాళ్లు క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.

    అయితే ఈ క్యాష్ బ్యాక్ యాపిల్ ప్రాడక్ట్ ను కొనుగోలు చేసినా వినియోగించుకోవాల్సి ఉంటుంది. యాపిల్ ప్రాడక్ట్ లను కొనుగోలు చేయడం ద్వారా వచ్చిన 5 వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను ప్రాడక్ట్ డెలివరీ అయిన వారం రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు యూజర్లు మాత్రమే పొందగలరు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు యూజర్లు ఈఎంఐల ద్వారా ప్రాడక్ట్ లను కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

    44,900 రూపాయల విలువ చేసే సింగిల్ ఆర్డర్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులను ఆర్డర్ చేయవచ్చు. ఇతర కంపెనీల ఉత్పత్తులతో పోలిస్తే యాపిల్ ఉత్పత్తుల క్వాలిటీ బాగుంటుందని వినియోగదారులు అభిప్రాయపడుతుంటారు. ఈ కారణం వల్లే యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇతర కంపెనీల ఉత్పత్తులు తక్కువ ధరకే లభ్యమైనా చాలామంది యాపిల్ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తారు.

    యాపిల్ కంపెనీ ఉత్పత్తులను ఇష్టపడే వారికి ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. భారీ మొత్తంలో క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నప్పటికీ యాపిల్ కంపెనీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పడంతో క్రెడిట్ కార్డ్ లేని వాళ్లకు ఈ ఆఫర్ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరదని చెప్పాలి.