https://oktelugu.com/

లైంగిక వేధింపుల గురించి మళ్ళీ చెప్పుకొచ్చింది !

అందాల తార రెజీనా పెద్ద హీరోయిన్ అవ్వాల్సింది. కానీ, అదృష్టం కలిసిరాక ఇంకా చిన్న సినిమాల హీరోయిన్ గా పెద్ద సినిమాల ఐటమ్ పాపగా మిగిలిపోయింది. ఆచార్యలో ఐటమ్ సాంగ్ తో అదరగొడుతుందట. ఆ సాంగ్ లో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిందట. ఇక తన పర్సనల్ లైఫ్ లో బాధల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రెజీనా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ బ్యూటీ దేని గురించి చెప్పింది అంటే.. లైంగిక వేధింపుల గురించి. కాకపోతే […]

Written By:
  • admin
  • , Updated On : January 16, 2021 / 03:44 PM IST
    Follow us on


    అందాల తార రెజీనా పెద్ద హీరోయిన్ అవ్వాల్సింది. కానీ, అదృష్టం కలిసిరాక ఇంకా చిన్న సినిమాల హీరోయిన్ గా పెద్ద సినిమాల ఐటమ్ పాపగా మిగిలిపోయింది. ఆచార్యలో ఐటమ్ సాంగ్ తో అదరగొడుతుందట. ఆ సాంగ్ లో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిందట. ఇక తన పర్సనల్ లైఫ్ లో బాధల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రెజీనా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ బ్యూటీ దేని గురించి చెప్పింది అంటే.. లైంగిక వేధింపుల గురించి. కాకపోతే ఇండస్ట్రీలో తనను ఎవ్వరూ లైంగికంగా వేధించలేదట. నిజానికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఓ డైరెక్టర్ తనకు ప్రపోజ్ చేశాడని.. అది తప్ప తనతో ఎవ్వరు అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది.

    Also Read: ఆమె కెరీర్ లో అతి పెద్ద తప్పు అదేనట !

    అయితే కాలేజీ రోజుల్లో మాత్రం ఆమె వేధింపులకు గురయ్యానని అంది. చెన్నైలోని ఇగా థియేటర్ బ్రిడ్జి వద్ద కొంతమంది అబ్బాయిలు రెజీనాను అడ్డుకుని.. ఆమె బాడీని తాకారని.. అలాగే ఆమెతో పాటు ఉన్న మరో నలుగురు అమ్మాయిల్ని కూడా అలాగే వేధించారని.. వాళ్లలో ఒకబ్బాయి అయితే రెజీనా పెదవులు తాకడానికి కూడా ప్రయత్నించాడని.. దాంతో తనను వేధించిన ఆ యువకుడ్ని పబ్లిక్ గానే పట్టుకొని కొట్టానని చెప్పుకొచ్చింది రెజీనా. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పిందిలేండి. అలాగే స్కూల్ డేస్ లో కూడా ఇలాంటి కొన్ని వేధింపులు ఆమె జీవితంలో ఉన్నాయట.

    Also Read: అది ఈ ముదురు భామకే సాధ్యం !

    మరి అమ్మాయిలు సున్నితంగా ఉంటే ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే అమ్మాయిలు కాస్త గట్టిగా వ్యవహరించాలని అంటోంది రెజీనా. తెలుగులో శంశ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. ఆ తర్వాత “రొటీన్ లవ్ స్టోరీ”, “పిల్ల నువ్వు లేని జీవితం”, “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమాలతో హీరోయిన్ గా నిలదొక్కుకున్నా… “ఎవరు” సినిమాలో విలన్ గా కూడా కనిపించి మెప్పించినా.. ఈ బ్యూటీని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రెజీనా కూడా థర్టీ ప్లస్ లోకి అడుగు పెట్టి చాల కాలం అయింది కాబట్టి.. ఇక స్టార్ హీరోయిన్ అవ్వడం అసాధ్యమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్