Earth Rotation
Earth Rotation: భూమి గోళాకారంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మన చిన్నప్పటి నుంచి భూమి గుండ్రంగా తిరుగుతుందనే విషయం తెలుసు. కానీ ఎలా తిరుగుతుందని మాత్రం ఎవరూ చూడలేదు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ (Dorje Angchuk) భూమి భ్రమిస్తున్న వీడియోను తీశారు. భూమి భ్రమిస్తున్న వీడియోను లఢఖ్‌లో టైమ్‌లాప్స్‌లో అతను బంధించారు. అంగ్‌చుక్ హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్-ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నారు. ఇతను 24 గంటల పాటు టైమ్‌లాప్స్‌ను ఉపయోగించి భూమి భ్రమిస్తున్న ఈ వీడియోని తీశారు. దీన్ని మొత్తం ఒక నిమిషం చేశారు. భూమి ఎలా భ్రమిస్తోందో అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోని తీయడానికి అంగ్‌చుక్ చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నక్షత్రాలు నిశ్చలంగా ఉన్నాయి. కానీ భూమి పరిభ్రమిస్తున్నట్లు ఉంటుంది. దీంతో అతను ఆ వీడియోని బంధించడానికి చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.
భూమి ఎలా భ్రమణం చెందుతుందో అందరికీ తెలిసిందే. కానీ ప్రాక్టికల్‌గా చూసినప్పుడే తెలుస్తుంది. అయితే భూ భ్రమణం గురించి విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేలా ఉండేందుకు ఈ వీడియో తీశారట. దీనివల్ల విద్యార్థులు భూమి ఎలా భ్రమణం చెందుతుందో అర్థం చేసుకోగలరని తెలిపారు. అయితే తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్ చేసినట్లు తెలిపారు. అయితే లఢఖ్‌లో చలి వీపరీతంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీనివల్ల వీడియో తీసున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. విపరీతమైన చలి ఉండటం వల్ల నాలుగు రాత్రుల్లో ఎన్నో సార్లు బ్యాటరీ వైఫల్యాలు వచ్చాయన్నారు. అలాగే టైమర్ పని చేయకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీడియో ఎలాగైనా తీయాలని నిర్ణయించున్నారట. అందుకే వైఫల్యాలను పట్టించుకోకుండా వీడియో తీశారు. పట్టుదలతో తీయడం వల్లనే ఏమో.. వీడియో ఇంత అందంగా వచ్చింది. వీడియోని చూడటానికి నిజంగా రెండు కళ్లు కూడా సరిపోవు. ఎంతో అందంగా వీడియో ఉంది. 24 గంటల పాటు దీన్ని తీయడం వల్ల మొత్తం కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం, సూర్యోదయం, రాత్రి ఇలా మొత్తం చాలా అందంగా ఉంది. దీన్ని వీక్షించిన నెటిజన్లు కూడా వావ్ అంటున్నారు. ఎంతో కష్టపడి ఇంత అందంగా తీశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చూడటానికి ఎంతో అందంగా ఉందని అంటున్నారు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసేయండి. భూమి భ్రమిస్తున్న వీడియో ఎలాగో ఉందో, మీకు ఏం అనిపిస్తోందో కామెంట్ చేయండి.
A Day in Motion – Capturing Earth’s Rotation
The stars remain still, but Earth never stops spinning. My goal was to capture a full 24-hour time-lapse, revealing the transition from day to night and back again. @IIABengaluru @asipoec (1/n) pic.twitter.com/LnCQNXJC9R
— Dorje Angchuk (@dorje1974) January 31, 2025
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: An indian astronomer captures a remarkable period of earths rotation from ladakh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com