గుడ్ న్యూస్ చెప్పిన వొడాఫోన్ ఐడియా,ఎయిర్‌ టెల్!

ఎయిర్‌ టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు శుభవార్త. అతి తక్కువ ఆదాయం కలిగిన ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ కాలపరిమితిని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల ఇన్‌ కమింగ్ సర్వీసులను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. సరిగ్గా అదే రోజుతో దేశ వ్యాప్తంగా పొడిగించిన లాక్ ‌డౌన్ గడువు కూడా ముగియనుంది భారతీ ఎయిర్‌ టెల్ కూడా ఇంచుమించు ఇలాంటి ప్రకటనే […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 4:46 pm
Follow us on

ఎయిర్‌ టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు శుభవార్త. అతి తక్కువ ఆదాయం కలిగిన ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ కాలపరిమితిని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల ఇన్‌ కమింగ్ సర్వీసులను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. సరిగ్గా అదే రోజుతో దేశ వ్యాప్తంగా పొడిగించిన లాక్ ‌డౌన్ గడువు కూడా ముగియనుంది భారతీ ఎయిర్‌ టెల్ కూడా ఇంచుమించు ఇలాంటి ప్రకటనే చేసింది.

ఖాతాదారుల వ్యాలిడిటీ గడువు ముగిసినప్పటికీ మే 3 వరకు ఇన్ ‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని తెలిపింది. కాగా, లాక్‌ డౌన్ తొలి దశలో ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీ గడువును పొడిగిస్తూ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు, పది రూపాయల టాక్‌టైంను కూడా అందించాయి. ఇప్పుడు లాక్‌డౌన్ గడవు మరోమారు పొడిగించడంతో చెల్లుబాటు అయ్యే కాలపరిమితిని మరోమారు పొడిగించాయి.