శ్రద్ధా కపూర్ సూక్తులు చెబుతోంది

రీసెంట్ గా వచ్చిన వచ్చిన బాలీవుడ్ యువ హీరోయిన్ లలో శ్రద్ధా కపూర్ ఒక ప్రత్యేక శైలిలో వెళుతోంది . `ఆషీకీ 2 `చిత్రం తో స్టార్డం సంపాదించు కొన్న శ్రద్ద కపూర్ ఆ తరవాత ” ఏ బి సి డి , స్ట్రీట్ డాన్సర్ , బాఘీ , చిచోరే వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ లో సుస్థిర స్తానం సంపాదించు కొంది. ఒకనాటి విలన్ శక్తి కపూర్ కి కూతురు . హీరోయిన్ […]

Written By: admin, Updated On : April 18, 2020 4:47 pm
Follow us on


రీసెంట్ గా వచ్చిన వచ్చిన బాలీవుడ్ యువ హీరోయిన్ లలో శ్రద్ధా కపూర్ ఒక ప్రత్యేక శైలిలో వెళుతోంది . `ఆషీకీ 2 `చిత్రం తో స్టార్డం సంపాదించు కొన్న శ్రద్ద కపూర్ ఆ తరవాత ” ఏ బి సి డి , స్ట్రీట్ డాన్సర్ , బాఘీ , చిచోరే వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ లో సుస్థిర స్తానం సంపాదించు కొంది. ఒకనాటి విలన్ శక్తి కపూర్ కి కూతురు . హీరోయిన్ పద్మిని కొల్హాపురికి మేనకోడలు , పాపులర్ గాయని లతామంగేష్కర్ కి ముని మేనకోడలు అయిన శ్రద్ద కపూర్ వ్యక్తిగతం గా చాలా మంచి హృదయం కల అమ్మాయి అని పేరు తెచ్చుకొంది.

అంతేకాదు ప్రభాస్ హీరోగా నటించిన `సాహో` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది. నటిగా విపరీతమైన క్రేజ్ ఉన్న శ్రద్ధకు పెంపుడు జంతువులు అంటే ప్రాణమట. తను పెంచుకునే కుక్క బాగోగుల గురించి ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులే కాదు జంతువులు కూడా ఆకలితో అలమటిస్తుంటే.. వాటి ఆకలి తీర్చేందుకు స్వచ్చంధ సంస్థకు విరాళం కూడా అందించిందట శ్రద్ద కపూర్.

లాక్ డౌన్ అనగానే ఒంటరి తనం – ఒత్తిడి – మానసిక సమస్యలతో భయపడిపోతున్నారు. మరి జంతువుల గురించి ఆలోచించరే అంటూ ప్రశ్నిస్తోంది. మిలియన్ సంఖ్యలో జంతువులు జీవితం మొత్తం బంధించబడి ఉంటున్నాయి. ఇప్పటికైనా మారండి… మనం ఈ భూమి మీదకి కేవలం అతిథులుగా మాత్రమే వచ్చాం , జంతువులు కూడా మనలాగే వచ్చాయి. అందువల్ల తోటి ప్రాణులను హింసించే హక్కు మనకు లేదు అని సోషల్ మీడియా లో చక్కగా హెచ్చరించింది .