https://oktelugu.com/

Airtel Tariff: ఎయిర్ టెల్ వినియోగదారులకు భారీ షాకింగ్ న్యూస్!

ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్ టెల్ సంస్థకు కోట్ల సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. అయితే కంపెనీ యూజర్లకు త్వరలో చేదు కబురు చెప్పబోతుందని తెలుస్తోంది. ఎయిర్ టెల్ టారిఫ్ లను పెంచడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ మిట్టల్ కంపెనీ టారిఫ్ రేట్లను పెంచడానికి వెనుకాడదని ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. పబ్లిక్ ఇష్యూ జారీ చేయడం ద్వారా ఎయిర్ టెల్ 21,000 కోట్ల రూపాయలను ప్రస్తుతం సమీకరించుకుంటోంది. మరోవైపు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 31, 2021 / 08:53 AM IST
    Follow us on

    ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్ టెల్ సంస్థకు కోట్ల సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. అయితే కంపెనీ యూజర్లకు త్వరలో చేదు కబురు చెప్పబోతుందని తెలుస్తోంది. ఎయిర్ టెల్ టారిఫ్ లను పెంచడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ మిట్టల్ కంపెనీ టారిఫ్ రేట్లను పెంచడానికి వెనుకాడదని ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.

    పబ్లిక్ ఇష్యూ జారీ చేయడం ద్వారా ఎయిర్ టెల్ 21,000 కోట్ల రూపాయలను ప్రస్తుతం సమీకరించుకుంటోంది. మరోవైపు దేశంలో 5జీ సేవలను ప్రారంభించే దిశగా అడుగులు పడ్డాయని సునీల్ మిట్టల్ చెప్పుకొచ్చారు. ఎయిర్ టెల్ కంపెనీ తన బ్యాలెన్స్ షీట్‌ను సైతం బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయని తెలుస్తోంది. ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ టెలీకాం ఛార్జీలు పెంచడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు.

    ఈ విషయాన్ని చెప్పడానికి ఏ మాత్రం తాను సంకోచించడం లేదని సునీల్ మిట్టల్ చెప్పుకొచ్చారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం కానే కాదని సునీల్ మిట్టల్ కామెంట్లు చేశారు. మొబైల్ టారిఫ్ కనీసం 33 శాతం పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. సునీల్ మిట్టల్ ప్రకటన తర్వాత ఎయిర్ టెల్ షేర్లు 4.25 శాతం పెరిగాయి. పెట్టుబడిదారులు సైతం పరిశ్రమ మనుగడ కొరకు ఛార్జీల పెంపును తప్పనిసరిగా అనుమతించాలని సునీల్ మిట్టల్ అన్నారు.

    సంస్థకు అప్పులు భారీగా పెరిగాయని సునీల్ మిట్టల్ అన్నారు. రైట్స్‌ ద్వారా సమీకరించే మొత్తం ఇండస్‌ పవర్‌లో వాటా పెంచుకునేందుకు ఉపయోగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎయిర్ టెల్ టారిఫ్ ధరలు పెంచితే మిగతా కంపెనీలు కూడా టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉంటుంది. ఎయిర్ టెల్ టారిఫ్ ధరలను పెంచడం యూజర్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.