
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు పలు శాఖలకు సారథ్యం వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీపీఎస్సీ) కార్యదర్శిగా నియమించింది. ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు.