https://oktelugu.com/

Airtel: ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్.. మోత మోగించింది..చార్జీలు ఎంత పెరిగాయంటే?

Airtel: ఎయిర్ టెల్ మరోసారి చార్జీలు పెంచేందుకు నిర్ణయించింది. వినియోగదారులపై మోత మోగించేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ చార్జీలు పెంచుతున్నట్లు సోమవారం చెప్పడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు మార్గాల్లో రేట్లు పెరుగుతున్నా మరోమారు దెబ్బ వేసేందుకు నిర్ణయించడం ఆందోళనకరమే. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో భయం పట్టుకుంది. ప్రవేశ టారిఫ్ వాయిస్ ప్లాన్ లై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25 శాతం పెంచేందుకు భావించింది. దీంతో వినియోగదారుడిపై రూ. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 22, 2021 / 03:43 PM IST
    Follow us on

    Airtel: ఎయిర్ టెల్ మరోసారి చార్జీలు పెంచేందుకు నిర్ణయించింది. వినియోగదారులపై మోత మోగించేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ చార్జీలు పెంచుతున్నట్లు సోమవారం చెప్పడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు మార్గాల్లో రేట్లు పెరుగుతున్నా మరోమారు దెబ్బ వేసేందుకు నిర్ణయించడం ఆందోళనకరమే. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో భయం పట్టుకుంది. ప్రవేశ టారిఫ్ వాయిస్ ప్లాన్ లై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25 శాతం పెంచేందుకు భావించింది.

    దీంతో వినియోగదారుడిపై రూ. 200-300 కు చేరుతుందని తెలుస్తోంది. మూలధనంపై రాబడి కూడా ఎక్కువ అవుతున్నట్లు సూచనలు వస్తున్నాయి. దీంతో నెట్ వర్కులకు గణనీయమైన పెట్టుబడులకు అవకాశం చిక్కినట్లు అవుతుంది. టారిఫ్ చార్జీలను సమతుల్యం చేసే క్రమంలో రూ.79తో వచ్చిన 28 రోజుల కాలపరిమితి గల ప్రామాణిక వాయిస్ ప్లాన్ కు ఇక రూ.99 చెల్లించాలి.

    దేశంలో అత్యధిక మంది వినియోగదారులున్న సంస్థగా పేరున్న ఎయిర్ టెల్ ఇప్పుడు చార్జీలు పెంచడంతో భారం పెరగనుంది. ఇప్పటికే అన్ని సంస్థలకంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న ఎయిర్ టెల్ మరోమారు వినియోగదారులపై భారం మోపేందుకు రెడీ అయింది. దీంతో మొబైల్ వినియోగంపై మరింత ఎక్కువ ధరలు చెల్లించేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడుతోంది.

    Also Read: ఎయిర్ టెల్ సిమ్ కార్డ్ ఉందా.. రూ.4 లక్షల బెనిఫిట్ పొందే ఛాన్స్..?

    ఎయిర్ టెల్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్లు టారిఫ్ లు పెంచుతున్నా ఆక్షేపణలు మాత్రం రావడం లేదు. దీంతో విచ్చలవిడిగా పెంచుతూ పోతోంది. రోజురోజుకు ఇలా పెరగడం వల్ల సగటు వినియోగదారుడు కష్టాల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా అందరికి ఫోన్లు అలవాటు కావడంతో ఇక చేసేది లేక ఎంత పెంచితే అంత కడుతూ వాడుకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.

    Tags