https://oktelugu.com/

Simbu: రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం.. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాం- శింబు

Simbu: తమిళ్ స్టార్ హీరో లవర్ బాయ్ శింబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో నువ్వు నా బుజ్జి పిల్ల అంటూ తన పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించారు శింబు. వల్లభ,మన్మథ వంటి సినిమాతో తెలుగు అభిమానులకు కూడా సంపాదించుకున్నారు.అయితే ఈ ఏడాది విడుదలైన “ఈశ్వరన్” చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. శింబు ఈనెల 25న విడుదల కానున్న చిత్రం “లూప్‌” […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 03:06 PM IST
    Follow us on

    Simbu: తమిళ్ స్టార్ హీరో లవర్ బాయ్ శింబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో నువ్వు నా బుజ్జి పిల్ల అంటూ తన పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించారు శింబు. వల్లభ,మన్మథ వంటి సినిమాతో తెలుగు అభిమానులకు కూడా సంపాదించుకున్నారు.అయితే ఈ ఏడాది విడుదలైన “ఈశ్వరన్” చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది.

    ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. శింబు ఈనెల 25న విడుదల కానున్న చిత్రం “లూప్‌” పొలిటికల్ నేపథ్యంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి అలా ప్రముఖ ఇంటర్వ్యూ ముచ్చటించారు హీరో శింబు.

    “ఇదో పొలిటికల్‌ థ్రిల్లర్‌ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం సామాన్యుల్ని ఎలా వాడుకుంటున్నారో” లూప్‌ “చిత్రం ద్వారా చెప్పాం”.ఇటువంటి చిత్రాలను తెరకెక్కించడం చాలా తక్కువ అని ఈ కాన్సెప్ట్‌ కొత్తగానూ కాస్త వింతగానూ దర్శకుడు వెంకట్‌ ప్రభు అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో తెరకెక్కించారని చెప్పుకొచ్చారు.

    ఎస్‌.జె.సూర్య ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేస్తున్నాడని ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపిస్తారని మా మధ్య టామ్‌ అండ్‌ జెర్రీలాంటి పోటీ జరుగుతుందని చెప్పారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శిని నటిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాబట్టి రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చాయట. సినిమా పూర్తిచేయడానికి మూడేళ్ల సమయం పట్టిందంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని చెప్పుకొచ్చారు శింబు.