Thaman Comments on Akhanda 2: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సినిమాకి మ్యూజిక్ చాలా అవసరం…కొన్ని సార్లు మ్యూజిక్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం టాప్యూజిక్ డైరెక్టర్లలో తమన్ కూడా ఒకడిగా చెలామణి అవుతున్నాడు. ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. రీసెంట్గా అఖండ 2 సినిమా సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న తమన్ సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశాడు.అఖండ 2 సినిమా డిసెంబర్ 6 న రిలీజ్ అవ్వాల్సింది. డిసెంబర్ 12 న రిలీజ్ చేశారు. దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్ చాలా వరకు నష్టపోయారు. ఇండస్ట్రీలో ఐకమత్యం కరువైంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఒక సినిమా రిలీజ్ కి వచ్చిన తర్వాత ఆ సినిమా మీద కేసు వేసి ఆపేయడం అనేది చాలా దుర్భరమైన పరిస్థితి…ఆ క్షణంలో నిర్మాతలు సినిమా రిలీజ్ అవ్వకపోతే వాళ్ళు ఎంత కంగారు పడిపోతారు. వాళ్లకు ఒక కుటుంబం ఉంటుంది. ఎందుకని ఇలాంటి ఒక పైసాచిక ఆనందాన్ని పొందడానికి కేసులు వేసి వాళ్లకు రావాల్సిన డబ్బులను రాబట్టుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దిష్టి తగిలిందంటూ ఆయన వ్యాఖ్యానించాడు… ఇదంతా చూసిన కొత్త సినిమా మేధావులు మాత్రం తమన్ నీకు రావాల్సిన డబ్బులు నువ్వు తీసుకొని సినిమాకి మ్యూజిక్ అందిస్తే సరిపోతోంది అంతేతప్ప సినిమా ఇండస్ట్రీ గురించి ఫైనాన్షియర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు.
ఎందుకంటే వాళ్లకు రావాల్సిన డబ్బులను ఎప్పుడూ వసూలు చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు… సినిమా రిలీజ్ సమయంలో వాళ్ళ మీద కేసు వేస్తేనే ప్రొడ్యూసర్స్ వాళ్ళకి డబ్బులను చెల్లిస్తారనే ఉద్దేశంతో వాళ్లు అలా కేసులు వేస్తుంటారు. ఈ మాత్రం దానికి నువ్వు ఊగిపోవాల్సిన పని లేదంటూ సోషల్ మీడియాలో అతని మీద కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…
ఇక మరి కొంతమంది మాత్రం నువ్వు రెమ్యూనరేషన్ తీసుకోకుండా మ్యూజిక్ చేయడం లేదు కదా? అయిన నువ్వు మ్యూజిక్ ను కాపీ చేస్తున్నావ్ అంటూ నీ మీద వచ్చిన కామెంట్స్ ను తొలగించుకునే ప్రయత్నం చేయి… ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటూ తమన్ ఏకిపారేస్తున్నారు.
తమన్ ఇలా ఉంటే రాబోయే రోజుల్లో అతనికి ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అలా మాత్రమే హక్కు కూడా తమన్ కి లేదు. నిజానికి తమన్ కి రావలసిన అమౌంట్ మొత్తం ఇవ్వకపోతే అనుకున్న సమయానికి ఇవ్వగలుగుతాడా? అనేది అతనే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పే వాళ్ళు సైతం ఉన్నారు…