Airtel Network Down: మనదేశంలో అతిపెద్ద టెలికాం నెట్వర్క్ గా ఎయిర్టెల్ కొనసాగుతోంది. జియో విపరీతమైన పోటీ చేస్తున్నప్పటికీ.. తనకు మాత్రమే సాధ్యమైన నెట్వర్క్ ద్వారా ఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. జియో వల్ల కొద్ది రోజులు ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తర్వాత తన వైడ్ రేంజ్ నెట్వర్క్ ద్వారా ఎయిర్టెల్ తన స్థాయిని కాపాడుకుంటున్నది. ఆ తర్వాత విస్తృతంగా సేవలు అందిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Also Read: తెలంగాణలో యూరియా కొరత.. రాష్ట్రం / కేంద్రం.. ఎవరు కారణం?
ఇటీవల కాలంలో కృత్రిమ మేథ ద్వారా పనిచేసే అప్లికేషన్ సేవలను యూజర్లకు అందిస్తున్నది.. 17వేల రూపాయల విలువైన ఈ సేవలను తన యూజర్లకు ఉచితంగానే ఇస్తున్నది. దీని ద్వారా తన మార్కెట్ స్థాయిని ఎయిర్టెల్ మరింత పెంచుకుంది. టారిఫ్ చార్జీల విషయాన్ని కాస్త పక్కన పెడితే.. మిగతా అన్నింటిలోనూ ఎయిర్టెల్ కాస్త మెరుగ్గానే ఉంది. అప్పట్లో వాయిస్ కాల్స్ విషయంలో ఎయిర్టెల్ మీద ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత ఆ సమస్యను ఎయిర్టెల్ త్వరగానే అధిగమించింది. అయితే ఇప్పుడు ఎయిర్టెల్ కు ఒక పెద్ద సమస్య వచ్చింది.
మనదేశంలోని పలు ప్రాంతాలలో ఎయిర్టెల్ నెట్వర్క్ పూర్తిగా డౌన్ అయింది. దీనిపై యూజర్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్స్, ఇంటర్నెట్ సమస్యలతో అసౌకర్యానికి గురయ్యారు. దీనిపై ఎయిర్టెల్ స్పందించింది..” సాంకేతిక సమస్యను గుర్తించాం. మా బృందం ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అతి త్వరలోనే మా సేవలను పునరుద్ధరిస్తాం. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి” అంటూ ఎయిర్టెల్ ఒక స్టేట్మెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో ఎన్నడూ ఎయిర్టెల్ కు ఇటువంటి సమస్య ఎదురు కాలేదు. విస్తృతమైన డిమాండ్ ఉన్నప్పటికీ.. విపరీతమైన భారం ఉన్నప్పటికీ ఎయిర్టెల్ తన నెట్వర్క్ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. కొన్ని సందర్భాలలో యూజర్లకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. మిగతా అన్ని సమయాలలో ఎయిర్టెల్ తనకు మాత్రమే సాధ్యమైన అత్యాధునిక సేవలు అందిస్తూ యూజర్ల నమ్మకాన్ని సొంతం చేసుకుంది. 5 జి స్థాయిలో సేవలు అందిస్తున్నప్పటికీ.. సాంకేతికపరమైన సమస్యలు ఎదురు కావడం ఎయిర్టెల్ బృందానికి ఇబ్బందికరంగా మారింది అని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎయిర్టెల్ బృందం పేర్కొంది.