Jayammu Nischayammu Raa Sreeleela: రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో మొదలైన జగపతి బాబు(Jagapathi Babu) ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) అనే టాక్ షో మొదటి ఎపిసోడ్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మొట్టమొదటి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో జగపతి బాబు, నాగార్జున మధ్య సాగిన సంభాషణ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆడియన్స్ నుండి, ప్రేక్షకుల నుండి ఈ ఎపిసోడ్ కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించి చర్చ. ఇక కాసేపటి క్రితమే రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి శ్రీలీల(Sreeleela) ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఆమెతో జగపతి బాబు జరిపిన సంభాషణ చాలా ఫన్నీ గా ఉంది. ఈ నెల 22 న టెలికాస్ట్ కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో కి సంబంధించిన విశేషాలు ఒకసారి చూద్దాం పదండి.
Also Read: ‘అన్ స్టాపబుల్’ షో రికార్డుని బద్దలు కొట్టిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో..ఎంత రేటింగ్స్ వచ్చాయంటే!
ముందుగా శ్రీలీల ని చూడగానే జగపతి బాబు ‘మేమందరం యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీ కి వచ్చాము. నువ్వు మాత్రం యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీ కి వచ్చావ్’ అని అంటాడు. అప్పుడు శ్రీలీల ‘ఇప్పుడు నన్ను తిట్టారా..? పొగిడారా?’ అని అంటుంది. అప్పుడు జగపతి బాబు ‘అబ్బో..అబ్బో..ఆమ్మో’ అనగానే శ్రీలీల పరుగులు తీస్తుంది. ఇక ఆ తర్వాత జగపతి బాబు ‘శ్రీలీల అని పిలవాలా? లేకపోతే ఇంకేమని పిలవాలి నిన్ను’ అని అడగ్గా, దానికి శ్రీలీల ‘లీల అని పిలవండి’ అంటుంది. అప్పుడు జగపతి బాబు ‘చాలా లీలలు ఉన్నాయి.. ఏ లీల అని పిలవాలి’ అంటాడు. అప్పుడు శ్రీలీల నవ్వుతూ ‘వద్దండీ ఇప్పుడు’ అని దండం పెడుతుంది. నీకు ఒకప్పుడు లెఫ్ట్ లేదా రైట్ లో కాస్త తేడా ఉండేది ఫేస్ అని అంటాడు జగపతి బాబు, అప్పుడు శ్రీలీల ‘ఆ టాపిక్ తీసుకొని వస్తే నేను మళ్ళీ నీ టాపిక్ తీసుకొని వస్తాను సార్’ అని అంటుంది.
అప్పుడు జగపతి బాబు ‘ఏ టాపిక్ తీసుకొస్తావ్’ అని అడుగుతాడు. ‘మీ హీరోయిన్ గారు..మీరు ఒకరు’ అంటూ చెయ్యి డబుల్ మీనింగ్ వచ్చే డైలాగ్ లో చూపిస్తూ అంటుంది శ్రీలీల. అప్పుడు జగపతి బాబు దానికి నవ్వుతాడు. ఇక ఆ తర్వాత జగపతి బాబు ‘మొదటి సినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేశావు’ అని అంటాడు, ‘దూల తీరిపోతుంది సార్’ అని శ్రీలీల అంటుంది. ఇలా ఆద్యంతం ఫన్నీ గా సాగిపోయిన ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే ఇది కూడా నాగార్జున ఎపిసోడ్ లాగానే పెద్ద హిట్ అయ్యేట్టు ఉంది. జగపతి బాబు లో ఈ యాంగిల్ చూసేందుకు చాలా బాగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ షో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
