Viral AI food vlog : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఇప్పటికే అన్ని రంగాలలో ఇది చొచ్చుకుపోయింది.. తద్వారా ఇప్పటివరకు సాధ్యం కానీ వింతలు.. మాయాజాలాలు అన్ని చోటుచేసుకుంటున్నాయి. అన్ని రంగాలలో పెను మార్పులకు కారణమవుతున్నాయి. ఇప్పటికే అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అని రంగాలలో ఉద్యోగుల కోత మొదలైంది. ఇది ఎక్కడ వరకు దారితీస్తుందో తెలియదు కాని.. ఇప్పుడైతే పరిస్థితి బాగోలేదు. బాగుపడుతుందనే నమ్మకం కూడా లేదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా అన్ని పనులు పూర్తవుతున్నాయి. నిపుణుల అవసరం లేకుండానే పనులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ విభాగంలో ఆర్టిఫిషర్ ఇంటెలిజెన్స్ పెను ప్రభావాన్ని చూపిస్తోంది. అన్ని విభాగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం వల్ల ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే పనులు జరిగిపోతున్నాయి. అందువల్ల ఆయా విభాగాలలో కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. మొత్తంగా పరిశ్రమ అవసరాలను మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తీర్చి వేస్తున్న నేపథ్యంలో మనుషుల శ్రమ అనేది అవసరం లేకుండా పోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుకు గొప్ప ఆవిష్కరణ అయినప్పటికీ.. అన్ని విభాగాలలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలు అనేవి ఊడిపోతున్నాయి. తద్వారా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది.
ఇక తాజాగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల గూగుల్ ఏఐ మోడల్ “వీఈ3″ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.. దీని ద్వారా ఒక ఫుడ్ వ్లాగ్ వీడియోను సృష్టించారు. దాని ప్రకారం చెన్నైలోని ఒక కాలనీలో వీధి వంటకాన్ని తిని రివ్యూ ఇచ్చే విధంగా వీడియోను ఏఐ రూపొందించింది. ఈ వీడియో అత్యంత సహజ సిద్ధంగా ఉంది.. ఆ వీడియో చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించినట్టు కనిపించడం లేదు. ఒక ఫుడ్ వ్లాగర్ ఆ వీడియోను రూపొందించినట్టు కనిపిస్తోంది. పైగా చెన్నైలోని ఓ వీధిలో ఉన్న హోటల్లో అక్కడి ఆహారం తిని.. రేటింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వల్ల కంటెంట్ క్రియేటర్లకు ఇక పని ఉండదని.. వారంతా కూడా దుకాణం సర్దేసుకోవాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మాయాజాలం వల్ల ఇలాంటి వీడియోలు పుట్టుకొస్తున్నాయని.. వీటిని కనుక ఇలానే ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు కాలంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గొప్పదైనప్పటికీ.. ఇలానే వినియోగించుకుంటూ పోతే పెను ప్రమాదాలు తలెత్తుతాయని టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ” శాస్త్ర సాంకేతిక రంగాలు అనేక విధాలుగా అభివృద్ధిని సొంతం చేసుకున్నాయి. అవి మనిషి మనుగడకు దోహదం చేశాయి. కానీ ఇలా మనుషులను ప్రభావితం చేస్తూ.. ఇబ్బంది పెడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి సాధిస్తే మాత్రం భవిష్యత్తు కాలంలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని” నిపుణులు హెచ్చరిస్తున్నారు.