AI Blackmail : రోబో అనేది సినిమా కాబట్టి.. కాస్త ఫిక్షన్ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో అలా జరుగుతుందా? మనిషి మేథస్సు ద్వారా పుట్టిన ఆవిష్కరణ.. చివరికి మనిషికే ఎదురు తిరుగుతుందా? అంటే ఈ ప్రశ్నలకు నిజమే అనే సమాధానం వస్తోంది. ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలలో విస్తరించింది. ఇది అన్ని విభాగాలలో అత్యంత చెరుకుగా పనులు చేస్తోంది. మానవ మేధస్సు మాదిరిగానే ఇది పనిచేస్తుండడంతో.. అన్ని విభాగాలలో దీని వాడకం అనివార్యం అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మనిషి జీవితంలో సమూల మార్పులు వచ్చాయి.. అయితే ఈ మార్పులు సానుకూల దిశగా వెళితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో కూడా వ్యతిరేక విధానాలు చోటు చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది.
Also Read : సెమీకండక్టర్ అంటే ఏమిటి? ఎందుకు ఇది అంత విలువైనది?
ఇప్పటి కాలంలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను ఎవరైనా సరే సులభంగా యాక్సిస్ చేసుకోవచ్చు. మనకు కావలసిన సమాధానం తెలుసుకోవచ్చు. అవసరమైతే డాక్యుమెంట్ రూపంలో కూడా పొందొచ్చు. సాఫ్ట్వేర్ విభాగంలో కోడింగ్ లాంటి పనులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంటనే చేసిపెడుతోంది. తాజాగా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ మెయిల్ చేసింది. దీనికి సంబంధించిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు కారణమవుతోంది.
ఓ సాఫ్ట్ వేర్ డెవలపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను యాక్సిస్ చేసుకుని వాడుతున్నాడు. అయితే దానితో సరదాగా సంభాషణ జరుపుతున్నాడు. ఈ సమయంలో.. ప్రస్తుత కాలంలో డెవలపర్లు మరింత అభివృద్ధి చేసిన మోడల్ ను వాడుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ సంభాషణ జరుగుతున్న సందర్భంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిమ్మతిరిగే సమాధానం అతనికి ఇచ్చింది. తనను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను మార్చేస్తే.. అతడికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయట పెడతానని ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దీంతో అతడు ఒకసారిగా భయపడ్డాడు. ఈ విషయాన్ని అతడు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. దీంతో అది క్షణంలోనే వైరల్ అయింది. అయితే ఈ సంభాషణను టెక్నాలజీ నిపుణులు రకరకాలుగా చెబుతున్నారు.. అయితే ఆ డెవలపర్ తన వ్యక్తిగత విషయాలను స్టోరేజ్లో భద్రపరచుకోవడం లేదా ఆన్లైన్లో ఉంచడం వల్ల.. దానిని పసిగట్టి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడి ఉంటుందని చెబుతున్నారు..
” ఎంత టెక్నాలజీ మీద పట్టు ఉన్నప్పటికీ.. కొన్ని విషయాలను చెప్పుకోకూడదు. వాటిని ఆన్లైన్ లో భద్రపరచకూడదు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారంగా నడిచే వాటితో డిస్కస్ చేయకూడదు. అలా చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. పొరపాటున డెవలపర్ ఇంట్లో వాళ్ళు ఈ విషయాన్ని గమనించలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని” టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను యాక్సిస్ చేసుకున్నంతమాత్రాన ప్రతి విషయాన్ని డిస్కస్ చేయొద్దని.. వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.