Agnibaan Rocket: అంతరిక్ష మార్కెట్‌లోకి భారత్‌.. ‘అగ్నిబాణ్‌’తో కీలక అడుగు

అగ్నిబాణ్‌ ప్రయోగం కేవలం రెండు నిమిషాల వ్యవధిలో సింగిల్‌ స్టేజ్‌లోనే జరిగింది. దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్‌ పీజ్‌ త్రీడి ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ అమర్చారు.

Written By: Raj Shekar, Updated On : May 30, 2024 1:11 pm

Agnibaan Rocket

Follow us on

Agnibaan Rocket: ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లోకి భారత్‌ కీలక అడుగు వేసింది. ప్రత్యేక శ్రేణి ఉప గ్రహాలను చౌకగా, వేగంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌(Agnikul) సంస్థ అగ్నిబాణ్‌ పేరిట తొలిసారి సబ్‌–ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగం నిర్వహించింది. గురువారం(మే 30న) ఉదయం 7:15 గంటలకు దీనిని ప్రయోగించినట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది. ఇందులో తొలిసారి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ లిక్వడ్‌ ఇంజిన్‌ కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ నిర్వహించింది. ఇస్రో చైర్మన్‌ సమనాథ్‌ కూడా అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థను అభినందించారు. నిజానికి ఈ ప్రనయోగం 45 రోజుల క్రితమే జరగాల్సింది. కానీ, నాలుగుసార్లు వాయిదా పడింది. ఐదోసారి విజయవంతం అయింది.

ఏమిటీ పరీక్ష..
అగ్నిబాణ్‌ ప్రయోగం కేవలం రెండు నిమిషాల వ్యవధిలో సింగిల్‌ స్టేజ్‌లోనే జరిగింది. దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్‌ పీజ్‌ త్రీడి ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ అమర్చారు. దీనిపై అగ్నికుల్‌ కాస్మోస్‌కు పేటెంట్‌ ఉంది. ఇది సబ్‌ కూల్డ్‌ ద్రవ ఆక్సిజన్‌ ఆధారంగా సింగిల్‌ స్టేజిలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు.

ఆటోపైలెట్‌ సిస్టం వినియోగం..
ఇక అగ్నిబాణ్‌ దీర్ఘవృత్తాకార ముక్కుతో ఉన్న రాకెట్‌. దీని పొడవు 6.2 మీటర్లు. దీనిలోపలే ఉపగ్రహం అమర్చారు. ఈ రాకెట్‌లో తొలిసారి ఐథర్‌నెట్‌ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్‌ వ్యవస్థను వాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోపైలెట్‌ కంట్రోల్‌ సిస్టం ఇందులో వినియోగించారు.

ఫెయిల్‌ అయినా ప్రమాదం జరుగకుండా..
ఇక ఈ ప్రయోగం అదుపుతప్పితే తక్షణమే దానిని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లైట్‌ టర్మినేషన్‌ వ్యవస్థను కూడా ఇందులో అమర్చారు. పలు రకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీనిని రూపొందించారు. కేవలం 300 కిలోలలోపు బరువు ఉన్న శాటిలైట్‌ ప్రయోగాలకు అవకాశాలు త్వరగా దొరకవు. వాటిని అగ్నికుల్‌ నిర్మించిన రాకెట్‌ అగ్నిబాణ్‌ సరిపోతుంది.

ప్రయోగం రెండు నిమిషాలే..
ఈ మొత్తం 6పయోగం దాదాపు రెండు నిమిషాల్లో పూర్తయింది. ముగిశాక రాకెట్‌ సముద్రంలో కూలింది. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు లాంచ్‌ ప్యాడ్‌ ఏఎల్‌పీ–01 ఈ పరీక్షకు వేదికైంది. రాకెట్‌ ప్రయోగించిన తర్వాత నాలుగు సెకన్లలో నిర్ణీత దశకు వెళ్లింది. 1.29 సెకన్ల సమయానికి ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరి అక్కడి నుంచి తిరిగి సముద్రంలో పడింది. అగ్నికుల్‌ ఇంజిన్, ఆకారం వాటిని విశ్లేషించి మరింత మెరుగుపర్చడానికి ఈ 2 నిమిషాల పరీక్ష ఉపయోగపడనుంది.