Pithapuram: ‘పిఠాపురం’ పై చంద్రబాబుకు వర్మ క్లారిటీ

తాజాగా విదేశాల నుంచి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబును వర్మ కలుసుకున్నారు.హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన వర్మ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళి,పవన్ కు అనుకూల అంశాలు, టిడిపి నుంచి ఓట్ల బదిలీ వంటి విషయాల్లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Written By: Dharma, Updated On : May 30, 2024 1:40 pm

Pithapuram

Follow us on

Pithapuram: ఏపీలో హాటెస్ట్ నియోజకవర్గం పిఠాపురం. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు. పవన్ గెలుపును తన భుజస్కందాలపై వేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం, జనసేనకు ఆ సీటు కేటాయించడంతో వర్మ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా నిరాశకు గురైంది. తీవ్ర ఆందోళనతో పార్టీ కార్యాలయంలోనే నిరసన తెలపాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవా? అన్న ప్రశ్న ఎదురైంది. కానీ చంద్రబాబు పిలుపుతో ప్రత్యేకంగా కలిశారు వర్మ. ఆ మరు క్షణం నుంచి పవన్ కోసం గట్టిగానే పనిచేశారు. పవన్ తో పాటు జనసైనికుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

తాజాగా విదేశాల నుంచి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబును వర్మ కలుసుకున్నారు.హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన వర్మ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళి,పవన్ కు అనుకూల అంశాలు, టిడిపి నుంచి ఓట్ల బదిలీ వంటి విషయాల్లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.పవన్ కళ్యాణ్ కు టిడిపి శ్రేణులనుంచి శత శాతం ఓటు బదిలీ అయిందని అధినేతకు వివరించారు. పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని కూడా తేల్చి చెప్పారు. దీంతో అధినేత సైతం ఎంతో సంతోషపడ్డారు. వర్మకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు వర్మ.

పిఠాపురంలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో వర్మ సక్సెస్ అయ్యారు. ఆ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు ఆయన. గతంలో పార్టీ టికెట్ తగ్గకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి గెలుపొందారు. అందుకే టెన్షన్ పడ్డారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పవన్ కు నష్టం తప్పదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒత్తిడి చేసినా వర్మ పెద్దగా పట్టించుకోలేదు. అధినేత చంద్రబాబు నిర్ణయమే తనకు శిరోధార్యం అన్నట్టు వ్యవహరించారు. పిఠాపురంలో పవన్ ను గెలిపించుకుని తీసుకొస్తానని ప్రతినబూనారు. అధికార పార్టీ నుంచి ఎన్నో రకాల ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చివరికి సొంత బావమరిదికి ఆపరేషన్ జరిగిన పిఠాపురం నియోజకవర్గాన్ని విడిచిపెట్టి వెళ్లలేదు. పైగా వర్మ భార్య, కుమారుడు సైతం పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అందుకే వర్మ అంటే జనసైనికులకు ఎనలేని అభిమానం. చంద్రబాబును కలిసిన తర్వాత వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులఓట్ల బదిలీ టిడిపికి సక్రమంగా జరిగినట్లు కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికైతే వర్మ పుణ్యమా అని.. టిడిపి, జనసేన స్నేహం మరింతపటిష్టంగా మారింది.