Important Apps: నేటి స్మార్ట్ కాలంలో మనిషి జీవితం మొత్తం యాప్స్ చుట్టూ తిరుగుతోంది. ఉదయపు వాకింగ్ నుంచి మొదలు పెడితే రాత్రిపూట పడుకునే వరకు ప్రతిదీ కూడా యాప్ ల ఆధారంగానే సాగుతోంది. సోషల్ మీడియా నుంచి ఫైనాన్షియల్ సర్వీస్ వరకు ప్రతి పని కూడా యాప్ ల ద్వారానే సాగుతోంది. అయితే మనం స్మార్ట్ ఫోన్ లో మిగతా యాప్స్ సంగతి పక్కన పెడితే.. ఈ ఆరు యాప్స్ మాత్రం కచ్చితంగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
m parivahan
మన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ వంటి వ్యవహారాలను ఈ యాప్ ద్వారా పర్యవేక్షించవచ్చు.. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు ఈ యాప్ ద్వారా మన ధ్రువపత్రాలను వారికి చూపించవచ్చు. అంతేకాదు, ట్రాఫిక్ పోలీసులు విధించే అపరాధ రుసుము నుంచి తప్పించుకోవచ్చు.
Ais
పన్ను చెల్లింపు దారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ఇది. ఒకరకంగా ఇది వ్యక్తిగత డాష్ బోర్డు లాగా పనిచేస్తూ ఉంటుంది. టీడీఎస్ నుంచి మొదలు పెడితే జిఎస్టి వరకు ప్రతి పన్నును దీనిద్వారా చెల్లించవచ్చు. అదే కాదు మన పన్ను చెల్లింపు చరిత్రను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
ఆర్.బి.ఐ రిటైల్ డైరెక్ట్
మన పెట్టుబడిని నేరుగా ప్రభుత్వ బాండులు, టీ బిల్లులు, సవరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టవచ్చు. ఈ యాప్ ద్వారా నేరుగా పెట్టుబడులు పెట్టి.. మనకు వచ్చే లాభాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇది అత్యంత సురక్షితమైనది.. పైగా ఎటువంటి ఖాతా చార్జీలు ఉండవు.
Digi locker
ఆధార్, పాన్, మార్క్ షీట్ లు, సర్టిఫికెట్లు సురక్షితంగా ఉంచడానికి ఇది అత్యంత సమర్థవంతమైన యాప్. అయితే వీటిని ప్రభుత్వ బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు ఉపయోగిస్తాయి. తప్పుడు దృవ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందే వారి పట్ల చర్యలు తీసుకోవడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
DiJi Yatra
విమానాశ్రయాలలో ప్రవేశించడానికి కచ్చితంగా బోర్డింగ్ పాస్ ఉండాలి. ఐడి కూడా ఉండాలి. అయితే డిజి యాత్ర యాప్లో మన వివరాలు నమోదు చేస్తే.. ఎటువంటి బోర్డింగ్ పాస్, ఐడి లేకుండానే విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. కేవలం మన ఫేస్ రికగ్నైజేషన్ ద్వారానే యాక్సిస్ చేసుకోవచ్చు. డిజి యాత్ర యాప్ కాంటాక్ట్ లెస్, పేపర్ లెస్ ప్రయాణానికి మద్దతు ఇస్తుంది.
Rail one
టికెట్ల బుకింగ్, రైలు స్థితి, కోచ్ స్థానాన్ని ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫుడ్ కూడా ఆర్డర్ చేయవచ్చు. ముందుగానే కాకుండా, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది నేటి తరం వారికి ఎంతో ఉపయోగమైన యాప్.
