Thaman abused Aadi Sai Kumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సంగీత దర్శకుడు తమన్… ఈ మధ్యకాలంలో వచ్చే పెద్ద సినిమాలన్నింటికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమాతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఓజి సినిమాలో అతను ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చాలామంది కొనియాడుతున్నారు. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి అతని బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ అయిందంటూ సినిమా మేధావులు సైతం కామెంట్ చేస్తుండటం విశేషం…ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడమే కాకుండా తన రిలాక్సేషన్ కోసం ఖాళీ సమయంలో క్రికెట్ ఆడతాడు అనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం సీసీఎల్ నడుస్తున్న క్రమంలో మ్యాచ్ ఆడటానికి వీళ్ళందరూ హైద్రాబాద్ నుంచి వైజాగ్ అయితే వెళ్లారు. అక్కడ మ్యాచ్ ఆడిన తర్వాత సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్, ఓంకార్, హనుమాన్ మూవీ దర్శకుడు అయిన ప్రశాంత్ వర్మ, ఓంకార్ వల్ల తమ్ముడు అశ్విన్ బాబు అందరు కలిసి ఒక కారులో ప్రయాణిస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే తమన్ వీడియో తీస్తూ వాళ్ళందరి గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఆది సాయికుమార్ గురించి మాట్లాడాడు. వైజాగ్ రండి ఇక్కడ అంతా మనదే అని నేనే చూసుకుంటాను అని చెప్పి కనీసం భోజనం కూడా పెట్టించలేదు కదరా అంటూ ఫన్నీగా ఆది మీద కొన్ని కామెంట్లు అయితే చేశాడు…
ఆది శంబాల సినిమాతో సక్సెస్ ని సాధించడం చాలా సంతోషంగా ఉందని తమన్ చెప్పడం విశేషం… ఇక దాంతో పాటుగా సిసిఎల్ లో క్రికెట్ ఆడుతున్నందుకు అలాగే తమ టీమ్ లో ఓంకార్ వికెట్ కీపర్ గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తమన్ చేయడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా సిసిఎల్ తరపున చాలా సంవత్సరాల నుంచి తనదైన సేవలను అందిస్తున్న తమన్ ఇంతకుముందు సీసీఎల్ లో మనవాళ్లు కప్పు కొట్టడానికి తన వంతు ప్రయంత్నమైతే చేశాడు…ఇక తమన్ హీరో ఆది ని తిడుతున్న వీడియో ను ఆది తన ఎఫ్బీ లో పోస్ట్ చేశాడు దాంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది…
