Iphone 17 Pro: భారతదేశంలో Apple కంపెనీ ఫోన్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఏ ఫోన్ మార్కెట్లోకి వచ్చినా.. వెంటనే దానిని కొనుగోలు చేయాలని చూస్తారు. ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ ను భారతీయులు క్యూలో ఉండి మరీ దక్కించుకుంటారు. అయితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉన్నా సరే.. చేతిలో ఐఫోన్ ఉండాలన్నదే కొందరి ధ్యేయం. ఇటీవల ఆపిల్ కంపెనీ ఓ మొబైల్ సేల్స్ పెంచుకునేందుకు భారీగా తగ్గింపును ప్రకటించింది. ఇప్పటికే దీనిని చాలామందిని కొనుగోలు చేసినా కూడా.. ఇప్పుడు దీనిపై ధర భారీగా తగ్గించడంతో మరింతగా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఆపిల్ కంపెనీకి చెందిన ఏ మొబైల్ పై తగ్గింపు ధర ప్రకటించారో చూద్దాం..
యాపిల్ కంపెనీకి చెందిన iphone 17 pro 512 GB స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.1,54,900 తో విక్రయిస్తున్నారు. అలాగే 1 TB స్టోరేజ్ ఉన్న మొబైల్ రూ.1,74,999 ధర ఉంది. ఈ మొబైల్ పై రూ.5,000 వరకు డిస్కౌంట్ను ప్రకటించారు. అయితే అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే పాత ఫోన్ పై ఎక్స్చేంజి చేయాలని అనుకునే వారికి రూ.64,000 వరకు ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు అన్నీ ఆన్లైన్ లో పొందుపరిచారు. ఆన్లైన్ ద్వారా డివైస్లను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.
భారతదేశంలోకి గత ఏడాది సెప్టెంబర్ లో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మొబైల్లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. HDR పిక్ బ్రైట్నెస్ ను అందిస్తూ మెరుగైన వీడియోలను వీక్షించవచ్చు. ఈ మొబైల్లో కెమెరా కూడా మెరుగ్గా పనిచేస్తుంది. 48 MP మెయిన్ కెమెరా ఉండగా.. 48 MP ఆల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా పనిచేస్తుంది.18 MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకుని అవకాశం ఉంటుంది. దీంతో వీడియో కాలింగ్.. వీడియో రికార్డింగ్ మెరుగ్గా షూట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇందులో ios 26 ఆపరేటింగ్ సిస్టం ను అమర్చారు. ఇది ఏఐ ఫీచర్లను కలిగే ఉండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏఐ తరహాలో కొన్ని పనులను సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఇందులో A19 ప్రో చిప్ ను అమర్చారు ఇది 2nm ప్రాసెస్ పై పనిచేస్తుంది. ఇక ఇందులో నాణ్యమైన బ్యాటరీ ఉండగా.. ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చినప్పుడు దీనిని కొనలేని వారు.. ఇప్పటికే మొబైల్ ఉన్నవారు ఎక్స్చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న డిస్కౌంట్ తో తగ్గింపు ధరతో కొత్త మొబైల్ పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.