Haryana Driver Lottery: లచ్చిందేవి అతని మీద కటాక్షం చెప్పింది. ఒక రోజులోనే అతని పేదరికాన్ని రూపుమాపింది. చూస్తుండగానే అతడిని కోటీశ్వరుడిని చేసింది. నిన్నటిదాకా అంతంతమాత్రంగా ఉన్న అతడి జీవితం ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
హర్యానా రాష్ట్రంలో లోహ్రీ మకర సంక్రాంతి పేరుతో బంపర్ లాటరీ తీశారు. ఈ లాటరీలో హర్యానాకు చెందిన డ్రైవర్ పృథ్వి సింగ్ జాక్ పాట్ కొట్టాడు. 500 తో టికెట్ కొనుగోలు చేసిన అతడు లాటరీలో 10 కోట్ల సంపాదించాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. పృద్వి కి భార్య సుమన్, కుమారుడు దక్షం, కుమార్తె రితిక, తండ్రి దేవిలా ఉన్నారు.
పృద్వి ఒక సాధారణ లారీ డ్రైవర్. దిగువ మధ్య తరగతి జీవితం.. అయితే తెలిసిన వ్యక్తి చెప్పడంతో 500 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. వాస్తవానికి తనకు లాటరీ తగులుతుందని అసలు అతడు ఊహించలేదు. అయితే రాత్రి పురస్కరించుకొని లాటరీ తీయడంతో పృద్వి కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ తగిలింది. ఆ నెంబర్కు 10 కోట్ల లాటరీ తగిలింది. దీంతో పృద్వి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. చూస్తుండగానే అతని పేదరికం కాలగర్భంలో కలిసిపోయింది. అతడు ఇప్పుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. లాటరీలో డబ్బు గెలిచిన తర్వాత పృద్వి కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు.
మనదేశంలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలు అధికారికంగా లాటరీ నిర్వహిస్తుంటాయి. ఇందులో హర్యానా కూడా ఉంది. హర్యానాలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన లాటరీలో పృద్వి 10 కోట్లు గెలుచుకున్నాడు. ” 500 పెట్టి టికెట్ కొనుగోలు చేశాను. లాటరీ తగులుతుందని ఆశ అయితే నాకు లేదు. కాకపోతే ఒకసారి ప్రయత్నించాలని చూశాను. ఈసారి అదృష్టం నా వైపు ఉంది. దేవుడు నన్ను కనికరించాడు. అందువల్లే పది కోట్ల లాటరీ తగిలింది. వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు నిర్మించుకుంటాను. పిల్లలను అత్యున్నతమైన విద్యాసంస్థల్లో చదివిస్తాను. మిగిలిన డబ్బుతో వ్యాపారం మొదలు పెడతానని” పృధ్వి పేర్కొన్నాడు.
Chandigarh: Punjab State Dear Lohri Makar Sankranti Bumper 2026 lottery announced its first prize winner, awarding a jackpot of ₹10 crore. pic.twitter.com/osEtKWaAOc
— IANS (@ians_india) January 19, 2026
