Google Doodle: 25 ఏళ్ల గూగుల్ డూడుల్..ఎన్నో ప్రత్యేకతలు

గూగుల్ ను అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ కి చెందిన సెర్జి బ్రౌన్, లారీ పేజ్ 1998 సెప్టెంబర్ 4న నెలకొల్పారు. ఇన్ని సంవత్సరాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు.

Written By: Bhaskar, Updated On : September 27, 2023 2:14 pm

Google Doodle

Follow us on

Google Doodle: గూగుల్.. పాతికేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సెర్చ్ ఇంజన్ మనిషి జీవితంలో సమూలమైన మార్పులకు కారణమైంది. ఈ సెర్చ్ ఇంజన్ సెప్టెంబర్ 27 తో 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గూగుల్ డూడుల్ ఘనంగా జరుపుకుంటున్నది. సరిగా పాతిక సంవత్సరాలు అంటే 1998 సెప్టెంబర్ 27న డూడుల్ ఆవిర్భవించింది. అప్పటినుంచి ఆ తేదీ నాడు అధికారికంగా ఈ సెర్చ్ ఇంజన్ వార్షికోత్సవం జరుపుకుంటున్నది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల దాటిన తర్వాత గూగుల్ డూడుల్ మారిపోయింది. గూగుల్ స్థానంలో G25gle అనే అక్షరాలు స్క్రీన్ పై ప్రత్యక్షమవడం ప్రారంభమైంది.

గూగుల్ ను అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ కి చెందిన సెర్జి బ్రౌన్, లారీ పేజ్ 1998 సెప్టెంబర్ 4న నెలకొల్పారు. ఇన్ని సంవత్సరాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుగులేని వేదికను రూపొందించారు. క్రోమ్/ డెస్క్ టాప్/ వెబ్ వెర్షన్ యూజర్ల కోసం డార్క్ మోడ్ సైతం తీసుకొచ్చారు. సిస్టం థీమ్ ను డార్క్ మోడ్ లో పెట్టుకుంటే గూగుల్ క్రోమ్ డెస్క్ టాప్ కూడా ఆటోమేటిక్ గా డార్క్ మోడ్ లోకి వెళుతుంది. గూగుల్ తొలిసారిగా 2019లో నైట్ మోడ్/ డార్క్ మోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే అప్పట్లో దీనిని ఆండ్రాయిడ్ 10 కే పరిమితం చేసింది. అనంతరం దానిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక సంఘటనలు, సందర్భాలను గుర్తు చేస్తూ రావడం డూడుల్ స్పెషాలిటీ. చంద్రయాన్_3 లో భాగమైన విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుడిపై అడుగు మోపిన సందర్భాన్ని వేడుకలాగా జరుపుకుంది. అంతేకాదు మన దేశీయ స్ట్రీట్ ఫుడ్ పానీపూరిని సైతం అద్భుతమైన వంటకం గా డూడుల్ గుర్తించింది. తాజాగా తన ఆవిర్భావ వేడుకలను గుర్తు చేస్తూ డూడుల్ ను రూపొందించింది గూగుల్ యాజమాన్యం. 25వ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టినట్టు వివరించింది. దీనికి సంబంధించిన వివరాలను సుందర్ పిచాయ్ విడుదల చేశారు. మరిన్ని విప్లవాత్మక మార్పులను యూజర్లు చూడబోతారంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గూగుల్ 25వ వార్షికోత్సవానికి సంబంధించిన “#Google25” యాష్ టాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.