112 India App: ఆన్‌డ్రాయిడ్ ఫోన్లు వచ్చాక, ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా తమ సేవలను ఫోన్ల ద్వారానే అందిస్తున్నాయి. ఇక ఈకామర్స్ సంస్థల గురించి అయితే చెప్పనవసరంలేదు. అనేక సంస్థలు ఆన్‌లైన్‌లో తమ ప్రొడక్టులు విక్రయిస్తున్నాయి. ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇక ప్రభుత్వాలు కూడా అనేక యాప్స్‌ను రూపొందించి వివిధ సేవలను అందిస్తున్నాయి. అలాంటి యాప్స్‌లో ఇది ఒకటి. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేఈ యాప్ తప్పనిసరిగా ఫోన్‌లో ఉండాలి.
112 ఇండియా మొబైల్ యాప్..
ఈ యాప్ పేరు 112 ఇండియా మొబైల్‌యాప్. మనకు ఎలాంటి సాయం కావాలన్నా.. ఈ యాప్‌లో ఉన్న ఆప్షన్స్‌పై ఒక్క క్లిక్ చేసి పది నిమిషాల్లో సాయం పొందవచ్చు. ఈ యాప్‌లో పోలీస్, ఫైర్, అంబులెన్స్, బస్, రైల్, డిజాస్టర్, వుమెన్స్, చిల్డ్రన్స్‌కుతోపాటు ఇతర సేవలకు సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఏ సేవలు కావాలంటే ఆ సేవలు ఒక్క క్లిక్ చేస్తే చాలు. ఆ సేవలు పొందుతాము.
పోలీస్ హెల్స్ కావాలంటే..
పోలీస్ హెల్ కావాలంటే.. 112 ఇండియా మొబైల్ యాప్ ఓపెన్ చేసి దానిలోని పోలీస్ ఆప్షన్‌పై ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీరు ఉన్న లోకేషన్‌తో సహా మీదగ్గరలోఉన్న పోలీస్ హెల్ప్ డెస్క్‌కు వెళ్తుంది వెంటనే పోలీసులు స్పందిస్తారు. లొకేషన్ ఆధారంగా మీరు ఉన్న ప్రదేశానికి పది నిమిషాల్లో చేరుకుంటారు.
అంబులెన్స్ సేవలు..
ఇక యాక్సిడెంట్, లేదా ఎదైనా మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉంటే 112 ఇండియా మొబైల్ యాప్ ఓపెన్ చేసి మెడికల్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే సమీపంలోని మెడికల్ హెల్ప్ డెస్క్‌కు మీరు ఉన్న లొకేషన్‌తోపాటు సమాచారం వెళ్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమై.. మీకు అవసరమైన మెడికల్ సాయం అందిస్తారు.
పైర్ హెల్ప్..
ఇక అగ్ని ప్రమాదాలు, అనుకోని విపత్తులు జరిగినప్పుడు కూడా వెంటనే సేవలు పొందడానికి 112 ఇండియా మొబైల్ యాప్‌లోని ఫైర్ లేదా డిజాస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే అందుకు సంబందించిన సేవలు పది నిమిషాల్లో మీరు పొందవచ్చు. ఇలా అనేక రకాల సేవలను ఈ ప్రభుత్వ యాప్ అందిస్తుంది. అందుకే మీరు వెంటనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ముఖ్యంగా అమ్మాయిలకు, యువతులు, మమిళలకు ఈ యాప్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది.