Astro Tips: అన్ని దానాల్లోకెల్ల అన్నదానం మిన్న అంటారు. కానీ కొన్ని దానాల వల్ల మంచి జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్యులు. అయితే సనాతన ధర్మంలో దానధర్మాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఎవరి స్థాయిని బట్టి వారు దానధర్మాలు చేస్తుంటారు. అందులో కొందరు పప్పులను కూడా దానం చేస్తారు. మరి పప్పుల్లో ఏ పప్పు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందో తెలుసా?
మినపప్పు.. శనివారం రోజు మినపప్పు దానం చేయడం శుభమట. ఈ పప్పును దానం చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. వ్యాపారంలో వచ్చే అడ్డంకులు కూడా తొలిగిపోతాయి. శనిదేవుని శనివారం నాడు నల్లని మినపప్పును దానం చేయండి. ఎవరైన ప్రతికూల శక్తుల వల్ల బాధ పడితే.. కొంచెం మినపప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ తిప్పి దక్షిణం వైపు విసిరివేయాలి.
కందిపప్పు.. కందిపప్పు దానం వల్ల గురు దోషం పోతుందట. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలిగిపోతాయట. అయితే బుధవారం నాడు పావురాలకు కందిపప్పు, శనగలను ఆహారంగా వేస్తే మంచి జరుగుతుందట. అంతేకాదు విష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది.
మైసూర్ పప్పు.. మంగళవారం ఎర్రపప్పును, బుధవారం పెసరపప్పును దానం చేస్తే శుభం జరుగుతుందట. పెసరపప్పు వల్ల వినాయకుడి ఆశీర్వాదం దక్కుతుంది. ఏ పని చేసిన వచ్చే అడ్డంకులు తొలిగిపోతాయి. అంతేకాదు పెసర పప్పు దానం వల్ల ఆర్థిక లాభాల ఆశీర్వాదం దక్కుతుందట. ప్రతి రోజు పూజ చేసేటప్పుడు గణేశుడికి పెసర పప్పు పెట్టడం వల్ల శుభ ఫలితాలు వస్తాయట.
శనగపప్పు.. గురువారం రోజు విష్ణుమూర్తి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు శనగపప్పును విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టండి. అంతేకాదు పచ్చిశనగపప్పును లేదా శనగపప్పును దానం చేయాలి. దీని వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.