IPL 2022: క్రికెట్ లవర్స్ ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను త్వరగా స్టార్ట్ చేయాలని అతి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భారత దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ ఐపీఎల్ ప్లాన్స్ మార్చుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా వేలం వాయిదా వేయడంతో పాటు ఐపీఎల్ టోర్నీని పూర్తిగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్వహించాలని అనుకుంటుందట.
ఈ క్రమంలోనే టైటిల్ స్పాన్సర్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసేసుకుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా మన దేశానికే చెందిన టాటా గ్రూప్ సంస్థ వ్యవహరిస్తుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఈ డెసిషన్ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది అనగా రెండేళ్ల పాటు టాటా సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉండబోతున్నది.
Also Read: మేఘాలు ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా లెక్కిస్తారో తెలుసా?
2020లో చైనా దేశంతో భారత్‌కు సరిహద్దు వివాదం నెలకొని ఉండటంతో ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్నటువంటి వివోను తొలగించాలని అప్పటి నుంచి డిమాండ్స్ ఉన్నాయి. కాగా, తాజగా చైనీస్ కంపెనీ వివో స్పాన్సర్ షిప్ నుంచి తప్పకోబోతున్నది. వివో కంపెనీకి ఉన్న ఒప్పందం ప్రకారం ఇంకా రెండేళ్ల పాటు స్పాన్సర్ షిప్ లో ఉండాల్సింది. కానీ, వివో తప్పుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ పది జట్లతో జరగనుంది. 2011 తర్వాత ఐపీఎల్ ఇలా మళ్లీ 10 జట్లతో జరగబోతున్నది.
ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది అనగా ఈ సారి కూడా ఐపీఎల్ సమ్మర్ లోనే ఉండబోతున్నది. ఇందుకోసంగాను ఇప్పటికే కొన్ని కొత్త జట్లు కలవబోతున్నాయి. లక్నో, అహ్మదాబాద్ కలవనున్నాయి. ఇక ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా కూడా పూర్తి అయింది. కొత్త జట్లు అనగా లక్నో, అహ్మదాబాద్ తమ రిటెన్షన్ ఆటగాళ్లను ఎంచుకోవడానికిగాను బీసీసీఐ ఈ నెల 31 వరకు గడువు ఉంది. ఇప్పటి వకు ఎటువంటి షెడ్యూల్ ఖరారు చేయలేదు. కానీ, వచ్చే నెల మొదటి వారంలో ఐపీఎల్ మెగా వేలం జరిగే చాన్సెస్ అయితే ఉన్నాయి. ఏప్రిల్ రెండో వారంలో ఐపీఎల్ స్టార్ట్ కానుంది.
Also Read: అమెరికా ఆరోగ్యవ్యవస్థకే చుక్కలు చూపిస్తున్న కరోనా.. రాబోయే రోజుల్లో పీక్ స్టేజ్‌కి..
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Tata group to replace vivo as ipl title sponsor
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com