Allu Arjun: అల్లు అర్జున్ కి పుష్ప 2 మూవీ అటు ఖేదం ఇటు మోదం మిగిల్చింది. పుష్ప 2 ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టినందుకు ఆనందపడాలో… మహిళ మరణంతో ఎదురవుతున్న విమర్శలు, ఆరోపణలకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత మరణించింది. ఆమె కుమారుడు సైతం తీవ్ర గాయాలపాలు కాగా… ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మహిళ మృతి పై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ సైతం అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. ఒక ప్రమాదానికి అల్లు అర్జున్ ని పూర్తి బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయడం సరికాదంటూ ప్రతిపక్షాలు, సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పలువురు నటులు, దర్శక నిర్మాతలు అల్లు అర్జున్ ని కలిసి సంఘీభావం తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. అల్లు అర్జున్ తప్పు చేశాడు, అరెస్ట్ అయ్యాడు. ఆయనకు కన్ను పోయిందా? కాలిపోయిందా?, ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని కలిసి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఏమిటీ? ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ గురించి ఎవరైనా ఆలోచించారా? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తాడు. రేవంత్ రెడ్డి విమర్శల నేపథ్యంలో అల్లు అర్జున్ శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
రేవతి మృతి కేవలం ఒక ప్రమాదం. అలా జరగకూడదు. నేను చాలా చింతిస్తున్నాను. అయితే నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను నేను తీసుకోలేకపోతున్నాను. క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉందని స్టాఫ్ తెలిపిన వెంటనే నేను థియేటర్ నుండి బయటకు వచ్చేశాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు. శ్రీతేజ్ నా కుమారుడితో సమానం అన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అనంతరం సోషల్ మీడియాలో అతిపెద్ద రచ్చ మొదలైంది. యాంటీ ఫ్యాన్స్.. ఆయన ఇంటర్వెల్ వరకు థియేటర్లో ఉన్నారంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ మహిళ చనిపోయిన విషయం ఆయనకు చెప్పలేదని కౌంటర్లు ఇస్తున్నారు. అల్లు అర్జున్ ని ఆమె మృతికి పూర్తిగా బాధ్యుడిని చేయడం సరికాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
Web Title: Sandhya theater incident how much is allu arjuns fault the biggest commotion after the press meet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com