Hero Sumanth: ప్రముఖ టాలీవుడ్ హీరో సుమత్, నిర్మాత సుప్రియ కోర్టుమెట్లు ఎక్కారు. ఓ చెక్ బౌన్స్ కేసులో వీరిద్దరూ మార్కాపురం కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. గతంలో సుమంత్ హీరోగా బాలీవుడ్ సినిమా అయిన విక్కీ డోనార్‌ను తెలుగులో నరుడా.. డోనరుజా పేరుతో రీమేక్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్యూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు మార్కాపురంకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫైనాన్స్ అందించారు. అయితే, నిర్మాతలు తనకిచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని కోర్టులో శ్రీనివాసరావు కేసు వేశారు. అప్పటి నుంచి వాయిదాల మీద ఈ కేసు నడుస్తూనే ఉంది. కరోనా వల్ల మధ్యలో కాస్త గ్యాప్ వచ్చి.. ఇప్పుడు మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది.
Also Read: మరో రీమేక్ చిత్రానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తాజాగా, మరోసారి ఈ కేసు వాయిదాకు రావడం వల్ల.. హీరో సుమంత్, నిర్మాత సుప్రియ మార్కాపురం కోర్టుకు వచ్చారు. అయితే, తీర్పు వెలువడిందా.. లేక మళ్లీ వాయిదా పడిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే సుమంత్ హీరో కావడంతో అక్కడి ప్రజలు అతనితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
కాగా, ప్రస్తుతం మళ్లీ మొదలైంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ హీరో.. గతంలో వచ్చిన మళ్లీ రావా సినిమా హిట్ కావడంతో అప్పటి నుంచి కథలను ఎంచుకోవడంలో జాగ్రత్తలు వహిస్తున్నాడు సుమంత్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: తిరుమల వెంకన్నను దర్శించుకున్న అఖండ మూవీ యూనిట్…
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sumanth and supriya at markapuram court
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com