spot_img
Homeక్రీడలుక్రికెట్‌Yuvraj Singh: యువరాజ్ సింగ్ పశ్చాత్తాపం.. ఆ ఇద్దరి క్రికెటర్లకు క్షమాపణ.. తెరవెనుక జరిగిన...

Yuvraj Singh: యువరాజ్ సింగ్ పశ్చాత్తాపం.. ఆ ఇద్దరి క్రికెటర్లకు క్షమాపణ.. తెరవెనుక జరిగిన కథ ఇది

Yuvraj Singh: టీమిండియా 2007లో టి20 వరల్డ్ కప్.. 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించడానికి ప్రధాన కారణం యువరాజ్ సింగ్. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో రక్తం కక్కుకుంటూ కూడా అతడు వీరోచితమైన బ్యాటింగ్ చేశాడు. భారత జట్టుకు గెలుపును అందించి.. వన్డే వరల్డ్ కప్ కల సాకారం అయ్యేలా చేశాడు.

యువరాజ్ అద్భుతమైన ఆల్ రౌండర్. సూపర్ బ్యాటింగ్ తో పాటు.. బౌలింగ్ కూడా చేస్తాడు. ఇక ఫీల్డింగ్ లో అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెరుపు వేగంతో బంతులను ఆపడం.. అదే స్థాయిలో రన్ అవుట్ లు చేయడం అతడికి మాత్రమే సొంతం.. అతడిని టీమిండియా తురుపు ముక్క అని అప్పట్లో పిలిచేవారు.

అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న యువరాజ్.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అతడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. టీమిండియాలో డైనమైట్ ఇలాంటి ఆటగాడు అభిషేక్ శర్మ కు కోచింగ్ ఇచ్చింది తనే. అతడి నాయకత్వంలో అభిషేక్ శర్మ రాటు తేలిపోయాడు. అయితే యువరాజ్ ఇప్పుడు ఉన్నట్టుండి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. విచారం ప్రకటించాడు.

యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ కూడా క్రీడాకారుడే. కాకపోతే అతని నోటికి అదుపు ఉండదు. ఇటీవల అతడు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అది కాస్త మీడియాలో పడి చర్చకు దారి తీసాయి. దీంతో యోగ్ రాజ్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అయింది. ఇటీవల యువరాజ్ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో యువరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కపిల్ దేవ్.. మహేంద్ర సింగ్ ధోనీకి క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించాడు.

” జరిగిన గొడవ ఏమిటో నాకు తెలియదు. కాకపోతే మా నాన్న చేసిన వ్యాఖ్యలు సరికావు. వాటిని నేను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను. కపిల్ దేవ్, ధోనికి క్షమాపణ చెబుతున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేయడం మంచిది. కపిల్ ఇండియాకు తొలి వన్డే వరల్డ్ కప్ అందించారు. ధోని 2011లో భారత జట్టుకు ప్రపంచ కప్ కలను సాకారం చేశారు. ఇటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు చేయడం సరైనది కాదని” యువరాజ్ అన్నారు.

యోగ్ రాజ్ కపిల్ దేవ్ పై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. 1980లో జట్టు నుంచి తనను తొలగించిన తర్వాత ఒకసారి కపిల్ దేవ్ ఇంటికి తుపాకీతో వెళ్లానని యోగ్ రాజ్ ఆరోపించారు. కెప్టెన్ అయిన తర్వాత కపిల్ దేవ్ తనను కారణం లేకుండా తొలగించారని యోగ్ రాజ్ ఆరోపించాడు. ధోని నాయకుడిగా ఉన్నప్పుడు యువరాజ్ కు సరైన అవకాశాలు ఇవ్వలేదని.. అతని వల్లే తన కొడుకు కెప్టెన్ కాలేకపోయాడని యోగ్ రాజ్ ఆరోపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version