Homeఎంటర్టైన్మెంట్Pandu Master: 'పండు మాస్టర్' ని వీడియో కాల్ లో ఓదార్చిన యాంకర్ సుమ.. గుండెల్ని...

Pandu Master: ‘పండు మాస్టర్’ ని వీడియో కాల్ లో ఓదార్చిన యాంకర్ సుమ.. గుండెల్ని పిండేస్తున్న లేటెస్ట్ వీడియో..

Pandu Master: ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న పండు మాస్టర్ , రీసెంట్ గానే యాక్సిడెంట్ కి గురైన సంఘటన ఆయన అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేసింది. కెరీర్ లో పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం విచారకరం. ఇప్పటికీ పండు మాస్టర్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. రీసెంట్ గానే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పండు మాస్టర్ ని కలిసిన వీడియో సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. తనకు యాక్సిడెంట్ అయ్యింది అనే బాధ లేదు. ఇంతకుముందు ఎంత సరదాగా ఉండేవారో, ఇప్పటికీ కూడా పండు మాస్టర్ అలా ఉండడాన్ని చూసిన నెటిజెన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా ప్రముఖ యాంకర్ సుమ కూడా పండు మాస్టర్ ని వీడియో కాల్ ద్వారా సంప్రదించింది.

అతని బాగోగులు తెలుసుకొని, జాగ్రత్తలు చెప్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. హాస్పిటల్ బెడ్ పై అలా కదలకుండా పడుకొని మాట్లాడుతున్న పండు మాస్టర్ ని చూసి నెటిజెన్స్ కంటతడి పెడుతున్నారు. కానీ పండు మాస్టర్ మాత్రం ధైర్యం గానే ఉన్నారు. అతని ధైర్యం చూస్తుంటే డాక్టర్లు చెప్పిన గడువు కంటే ముందుగానే కోలుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పండు మాస్టర్ ని మనం ‘బిగ్ బాస్ 10 ‘ లో చూడొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే కనుక జరిగితే పండు మాస్టర్ కెరీర్ లో గేమ్ ఛేంజింగ్ మూమెంట్ గా నిలుస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనడం అంటే ఆషామాషీ విషయం కాదు. టాస్కులు చాలా కఠినంగా ఉంటాయి.

ఫిజికల్ గా చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి పండు మాస్టర్ ఒకవేళ బిగ్ బాస్ కి వస్తే వాటిని తట్టుకొని నిలబడగలడా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుండి శేఖర్ మాస్టర్ , యాంకర్ సుమ వంటి వారు పండు మాస్టర్ ని పలకరించడం మనమంతా చూసాము, కానీ ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ , హైపర్ ఆది వంటి వారు ఇప్పటి వరకు పండు మాస్టర్ ని పలకరించినట్టు ఎలాంటి వీడియో ఫుటేజీ బయటకి రాలేదు. నెటిజెన్స్ ఈ వీడియోల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది జరుగుతుందో లేదో చూడాలి. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నటువంటి యాంకర్ సుమ, పండు మాస్టర్ సంభాషణకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version