Akhil Akkineni: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , నాల్గవ రోజు లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం , ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ జాబితాలో ఒకటిగా చేరబోతోంది. అఖిల్ కెరీర్ లో ఇది మొట్టమొదటి బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఆలస్యం గా హిట్ కొట్టినప్పటికీ , అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీర్చే రేంజ్ లో కొట్టారనే చెప్పాలి. ఫుల్ రన్ లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందో లేదో చెప్పలేము కానీ , ఒకవేళ రాబడితే మాత్రం అఖిల్ హిస్టరీ క్రియేట్ చేసిన వాడు అవుతాడు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ ని నిన్న గుంటూరు లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వివాదాస్పదం గా మారాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ‘కాలర్ ఎత్తడాలు వంటివి ఈసారి లేవు’ అంటూ ‘వార్ 2’ ఈవెంట్ లో ఎన్టీఆర్ తన రెండు కాలర్లను పైకి ఎత్తిన సందర్భాన్ని వెటకారం చేసినట్టుగా అభిమానులకు అనిపించింది. సోషల్ మీడియా లో నాగవంశీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. అఖిల్ కూడా ఈ కాలర్ ఎత్తే మూమెంట్ పై నిన్నటి ఈవెంట్ లో మాట్లాడుతూ ‘నన్ను నమ్మిన అభిమాన దేవుళ్ళందరికీ , నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను కాలర్ ఎగురవేయను , గంతులు వేయను , ఎగరను, నేను సైలెంట్ గా ఉంటాను. ఇక్కడి నుండి మన జర్నీ మొదలు కానుంది. ఇక నుండి సైలెంట్ గా నా యుద్ధం ఎదో నేను చేస్తాను. అది చాలా ప్రశాంతంగా , మీకోసమే చేస్తానని మాట ఇస్తున్నాను’ అంటూ మాట్లాడారు అఖిల్. ఇది కచ్చితంగా ఆయన కావాలని ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు కావు.
కానీ ఎన్టీఆర్ అభిమానులు వాటిని రిలేట్ చేసుకుంటున్నారు. అది సహజమే, ఎందుకంటే ఆ సందర్భం అలాంటిది మరీ. ఎన్టీఆర్ తో అఖిల్ కి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. గతం లో అఖిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చేవారు ఎన్టీఆర్. అదే విధంగా ‘లెనిన్’ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా అందించారు. అలాంటి ఎన్టీఆర్ పై అఖిల్ ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారు చెప్పండి?, కచ్చితంగా ఆయన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కావు అనేది మాత్రం పక్కా , కానీ అభిమానులు అలా తీసుకోవడం కాస్త కష్టమే. దీని పై అఖిల్ క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ వేస్తే ఎన్టీఆర్ అభిమానులు శాంతించే అవకాశం ఉంది. మరి అఖిల్ క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
ఈ అతి కూతలే వద్దనేది @AkhilAkkineni8 పిల్ల కుంత వేషాలు వేయకు !!
బతుక్కి 12 ఏళ్ళ తర్వాత ఒక యావరేజ్ సినిమా తీసావ్ హిట్ సినిమా కూడా కాదు ఆ సినిమాకు కూడా మా ఎన్టివోడి సపోర్టు అంతా ఇంతా కాదు విశ్వాసం లేని నక్కలు రా మీరు అందుకే మా బాలయ్య నీ బాబు ని పురుగుని చూసినట్టు చూస్తాడు.మా…
— సుజత్ God Of War️☪️✝️ (@Kadirodu_Offl) July 15, 2026
