Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ హీరోలందరు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇంతకుముందు వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమయ్యాడు. కానీ ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు ను చూసిన కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్లు సైతం తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు ఏం చేసినా కూడా మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ లోనే ఒకటి రెండు సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన వారణాసి సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు మరో సినిమాకి కమిట్ అయ్యే అవకాశాలు కూడా లేనట్టుగా తెలుస్తుంది.
ఇక ఆయన తెలుగు దర్శకులతోనే సినిమాలు చేస్తాడా లేదంటే హాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణి లో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. నిజానికి మహేష్ బాబు చాలా రిజర్వుడ్ గా ఉంటాడు. ఆయన పెద్దగా ఎవరితో కలిసిపోడు. తనకున్న కొంతమంది ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళతోనే స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన హాలీవుడ్ సినిమాను ఓకే చేసినట్లయితే ఆయన అమెరికా ఉండాల్సి వస్తుందేమో మరి అలాంటి సందర్భంలో ఆయన ఆ సినిమా కోసం ఎన్ని రోజులు డేట్స్ కేటాయిస్తాడు. తద్వారా హాలీవుడ్ మేకర్స్ అతన్ని ఎలా చూపిస్తారు అనే ఒక క్యూరియాసిటి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. వాళ్ళు అనుకున్న సినిమాను అతనితో చేయగలుగుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా స్క్రీన్ మీద మహేష్ బాబు లుక్స్ అద్భుతంగా ఉంటాయి. అయితే ప్రతి ప్రేక్షకుడిని తనవైపు తిప్పుకోగలిగే కెపాసిటి ఉందా? నిజంగానే మహేష్ హాలీవుడ్ సినిమాలను చేస్తాడా లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతాడా అనేది తెలియాల్సి ఉంది…
