Champions trophy 2025
Champions trophy 2025 : ఇప్పటికీ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. ఉగ్రవాదులకు ఊతం ఇస్తూనే ఉంటుంది. పైకి కల్లబొల్లి కబుర్లు చెప్పినప్పటికీ.. పాకిస్తాన్ భారత్ కు ఏదో ఒక రూపంలో వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది. భారత్ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం చైనాతో అంట కాగుతుంది. అమెరికాతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. అరబ్ దేశాల ముందు నక్క వినయాన్ని ప్రదర్శిస్తుంది. అందువల్లే భారత్ పాకిస్తాన్ వల్ల.. పాకిస్తాన్ చేస్తున్న నష్టాల వల్ల ప్రజలను కాపాడుకోవడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థిక పరిస్థితి దిగజారినప్పటికీ.. పౌరుల జీవనం దారుణంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఏమాత్రం పట్టించుకోదు. భారత్ పై విషం చిమ్మడానికి ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేస్తుంది. చివరికి మన దేశ జెండా కనిపించినా సహించలేదు. తట్టుకోలేదు.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంనికి ముందు కరాచీ నేషనల్ స్టేడియంలో బంగ్లా, భారత్ మినహా మిగతా అన్ని దేశాల జెండాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎగరవేసింది. దీనిపై సోషల్ మీడియాలో పాకిస్తాన్ తీరును నెటిజన్లు ఎండ కట్టారు. పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ అంటే నిత్యం విషం చిమ్ముతూనే ఉంటుందని మండిపడ్డారు. అయితే చివరికి పాకిస్తాన్ భారత జాతీయ జెండా ఎగరవేయడంలో తిక్క తర్కాన్ని చెప్పింది. భారత్ మా దేశంలో ఆడేందుకు రావడం లేదు కాబట్టి జెండా ఎగరవేయడం లేదని పాకిస్తాన్ దిక్కుమాలిన విశ్లేషణ చేసింది. బంగ్లాదేశ్ ఇంకా తమ దేశంలో అడుగుపెట్టలేదని.. అందువల్లే ఆ దేశ జెండా ఎగరవేయలేదని వ్యాఖ్యానించింది. చివరికి కాలాచి స్టేడియంలో భారత జాతీయ జెండాను ఎగరవేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్ జెండాను కూడా ప్రదర్శించింది .. ఇక తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తల పడినప్పుడు లాహోర్ స్టేడియంలోకి ఓ వ్యక్తి భారత జాతీయ జెండా తో అందులోకి వచ్చాడు. భారత జెండాను ప్రదర్శించాడు. దీనికి పాకిస్తాన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మైదానంలో భారత జాతీయ జెండాను ఎగరవేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని..జెండా ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ తీరుపై టీమ్ ఇండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ భారత్ అంటే నిత్యం విషం చిమ్మూతూనే ఉంటుందని మండిపడుతున్నారు. పాకిస్తాన్ దేశం బుద్ధి మారదని.. అలా మారితే అది పాకిస్తాన్ ఎందుకు అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు భారత జాతీయ జెండా తీసుకొని వస్తే పాకిస్తాన్ దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడినప్పుడు ఓ వ్యక్తి లాహోర్ మైదానంలోకి భారత జాతీయ జెండాను తీసుకొచ్చాడు.. దీనిపై పాకిస్తాన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. జెండాను స్వాధీనం చేసుకున్నారు. #India #ChampionsTrophy pic.twitter.com/sLwan3p8sg
— Anabothula Bhaskar (@AnabothulaB) February 25, 2025