https://oktelugu.com/

Today horoscope in telugu : మహాశివరాత్రి వేళ.. ఈ రాశుల వారికి అదృష్టం.. ఇక డబ్బుకు కొదవే ఉండదు..

Today horoscope in telugu : ఈ రాశి వారికి ఈ రోజు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటే మార్గం సుగమవుతుంది. కుటుంబ సభ్యుల కోసం చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

Written By: , Updated On : February 26, 2025 / 08:03 AM IST

Maha Shivratri 2025

Follow us on

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉండడం ఉంది. ఇదే రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టుకుంటుంది. దీంతో వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు. అయితే కొన్ని రాశుల వారు వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : వివాహం చేసుకోవాలనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే నూతన సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు వచ్చే అవకాశం. ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితుల సహాయంతో ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. శివానుగ్రహంతో అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులకు శివుడి అనుగ్రహం ఉండనుంది. మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగులు వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఇదే మంచి సమయం. తమ కార్యాలయాల్లో చేసిన పనులకు ప్రశంసలు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులు కొత్త ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఈ సమయంలో శంకరుడి అనుగ్రహం ఉండడం వల్ల అంతా మంచి జరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం. స్నేహితులతో పనిచేయడం వల్ల కొత్త అవకాశాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతారు. దేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. మాటలను అదుపులో ఉంచుకోకపోతే మరింత నష్టపోతారు.. అయితే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సాయంత్రం ఆర్థికంగా లాభాలు పొందుతారు. వ్యాపారులకు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటే మార్గం సుగమవుతుంది. కుటుంబ సభ్యుల కోసం చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెనుక ముందు ఆలోచించాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ప్రాజెక్టులపై సీరియస్గా దృష్టి పెడతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ రాశి వ్యాపారులకు అనుకూలంగా ఉండమంది. ఊహించని లాభాలు పొందుతారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే బాగా ఆలోచించాలి. ఉద్యోగులు కార్యాలయంలో అధిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతారు. అయితే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే వీరికి స్నేహితులు ధన సహాయం చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఏదైనా కేసు పెండింగ్లో ఉంటే దానిపై సిద్ధ వహించాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. జీవిత భాగస్వామి కోసం సమయం కేటాయిస్తారు. విహారయాత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులు కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. అయితే పెద్దల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. వివిధ రంగాల వారికి అనుకొని అదృష్టం ఉంటుంది. దీంతో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.