Year Roundup 2023: ఇయర్ రౌండప్ 2023 :అన్నింట్లో హిట్.. ఆఖరి ఫోర్ లో ఫట్.. టీమిండియా కు అదే దక్కలేదు…

ప్రస్తుతం రోహిత్ శర్మ చాలా గాయానికి గురైనట్టుగా తెలుస్తుంది. గాయాలు మానాలంటే చాలా సమయం పడుతుంది. ఇక ఇలాంటి దెబ్బకి మందు కూడా లేదు ఎందుకంటే వాళ్లు క్రికెట్ చూస్తున్నన్ని రోజులు వారికి ఈ ట్రోఫీలు ఓడిపోయిన విషయం అనేది ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది.

Written By: Gopi, Updated On : December 11, 2023 5:53 pm

Year Roundup 2023

Follow us on

Year Roundup 2023: కొన్ని గాయాలు బయటికి కనిపిస్తాయి వాటికి మందు వేస్తె తగ్గిపోతాయి కానీ కొన్ని గాయాలు మనసుకు తగులుతాయి వాటికి మందు ఉండదు అవి గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం వేదన కలుగుతుంది. కొన్ని సార్లు అయితే నరకం కనిపిస్తుంది.ప్రస్తుతం ఇండియన్ టీమ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇండియన్ క్రికెట్ టీం ఇండి విజ్యువల్ సిరీస్ లలో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ అన్ని కప్పులను గెలుచుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.

ఇక ఇలాంటి సమయంలో ఇండియన్ టీం ఇండి విజ్యువల్ సిరీస్ లను గెలుస్తుంది కానీ టోర్నీ లో మాత్రం గెలవలేక పోతుంది.ఇక ఇదే క్రమంలో 2023 వ సంవత్సరంలో రెండు ప్రపంచ కప్ టోపీలను కోల్పోయిన ఏకైక జట్టుగా ఇండియన్ టీం చరిత్రలో నిలిచింది. డబ్ల్యూటీసి ఫైనల్ లో ఆస్ట్రేలియా మీద చాలా దారుణంగా ఓడిపోయిన ఇండియన్ టీం, వన్డే వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ కి చేరుకొని ఆస్ట్రేలియా మీద ఓడిపోయి రన్నరప్ గా మిగిలింది.ఇక ఈ రెండు మ్యాచ్ లకి కూడా కెప్టెన్ రోహిత్ శర్మ కావడం విశేషం…

అందుకే ప్రస్తుతం రోహిత్ శర్మ చాలా గాయానికి గురైనట్టుగా తెలుస్తుంది. గాయాలు మానాలంటే చాలా సమయం పడుతుంది. ఇక ఇలాంటి దెబ్బకి మందు కూడా లేదు ఎందుకంటే వాళ్లు క్రికెట్ చూస్తున్నన్ని రోజులు వారికి ఈ ట్రోఫీలు ఓడిపోయిన విషయం అనేది ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. ఒక్క అడుగు దూరంలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలను కోల్పోవడం అనేది రోహిత్ శర్మ తో పాటు ఇండియన్ టీమ్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి.ఈ రెండు ట్రోఫీలను కనక రోహిత్ శర్మ గెలిచినట్టయితే ఇండియన్ టీం కెప్టెన్లలో రోహిత్ శర్మ నెంబర్ వన్ కెప్టెన్ గా మంచి పేరు సంపాదించుకునేవాడు… ఇక ప్రస్తుతం ఆయన అదే బాధలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ టీం ఉంటాడో లేదో కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఏజ్ 36 కావడంతో అప్పటివరకు ఆయనకు 40 సంవత్సరాలు వస్తాయి.ఇక ఫిట్నెస్ ని అప్పటివరకు కాపాడుకుంటూ ఉంటాడా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది…

ఇక విరాట్ కోహ్లీ కూడా వచ్చే వరల్డ్ కప్ వరకు టీంలో కొనసాగుతాడు అనే గ్యారెంటీ అయితే లేదు.ఇక ఇప్పుడైతే అద్భుతమైన ఫామ్ ను కనబరుచుతున్నాడు కానీ అప్పటివరకు ఎలాంటి సిచువేషన్ లో ఉంటాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ ఇయర్ వచ్చిన మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నందుకు ఇండియన్ టీం ప్లేయర్లు ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత విపరీతంగా ఏడ్చిన వీడియోలను కూడా మనం చూసాం… ఏదేమైనా 2023 అనేది ఇండియన్ టీం క్రికెట్ ప్లేయర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది అనే చెప్పాలి…