https://oktelugu.com/

Tollywood: 2023 లో చిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయాలను అందుకున్న 5 సినిమాలు ఇవే…

ఈ సంవత్సరం వచ్చిన పెద్ద సినిమాలు చాలా వరకు నిరాశపరిచాయి. అయినప్పటికీ కొన్ని చిన్న సినిమాలు మాత్రం పెద్ద సక్సెస్ లను సాధించాయి.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2023 / 05:57 PM IST

    Tollywood

    Follow us on

    Tollywood: ప్రతి సంవత్సరం ఇండస్ట్రీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతు ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను సాధించగా, మరికొన్ని సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ లను అందుకోవు. ఈ సంవత్సరం వచ్చిన పెద్ద సినిమాలు చాలా వరకు నిరాశపరిచాయి. అయినప్పటికీ కొన్ని చిన్న సినిమాలు మాత్రం పెద్ద సక్సెస్ లను సాధించాయి. అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో ఏవేవి ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    1.బేబీ
    ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా బేబీ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుంది. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 43 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీ విజయనందుకోవడంతో పాటుగా భారీ లాభాలను కూడా తెచ్చి పెట్టింది… ఇక ఈ సంవత్సరం చిన్న సినిమాల్లో పెద్ద హిటంగా నిలిచింది.

    2.బలగం
    కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తీసిన బలగం సినిమా ఈ సంవత్సరంలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా పేరు సంపాదించుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఒక ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక కోటి రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా 12 కోట్ల 50 లక్షల వరకు కలక్షన్స్ రాబట్టింది అంటే మామూలు విషయం కాదు…ఈ సినిమా తో వేణు లో ఇంత మంచి డైరెక్టర్ ఉన్నాడా అనేది జనాలకు తెలిసేలా చేసిన బలగం సినిమా ఆయన కెరియర్ కి ఒక మంచి మలుపు అనే చెప్పాలి…

    3.సామజవరగమన
    శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. మూడున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 15 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి చిన్న సినిమాల్లో మరో పెద్ద హిట్టుగా మిగిలింది…

    4. మ్యాడ్
    సంగీత్ శోభన్, నార్నే నితిన్ ముఖ్యపాత్రల్లో నటించిన మ్యాడ్ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాతో ఒక అదిరిపోయే సక్సెస్ కొట్టడమే కాకుండా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఇదొక ఎవర్ గ్రీన్ సినిమాగా మిగిలిపోయింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ అద్భుతమైన మేకింగ్ తో ఈ సినిమాని విజయతీరాలకు చేర్చాడు. రెండున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 9.30 కోట్ల కలెక్షన్లను రాబట్టి మంచి సక్సెస్ ను అందుకుంది…

    5. బెదురులంక 2012
    కార్తికేయ హీరోగా క్లాక్స్ డైరెక్షన్ లో వచ్చిన బెదురులంక సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా 4.50 కోట్ల తో తెరకెక్కగా 9 కోట్ల కలక్షన్స్ ని రాబట్టింది…

    ఇలా చిన్న సినిమాలు ఈ సంవత్సరం చాలా పెద్ద విజయాలను అందుకొని ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి…