https://oktelugu.com/

Yashaswi Jaiswal : మైదానం లోపల బ్యాటింగ్ పరాక్రమం.. వెలుపల యువతితో ప్రేమాయణం.. అదిరిందయ్యా యశస్వి..

టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్స్ తో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఓపెనింగ్ బ్యాటర్ గా అదరగొడుతున్నాడు.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ స్టైల్ తో పరుగుల వరద సృష్టిస్తున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 12, 2024 / 08:17 PM IST

    Yashaswi Jaiswal

    Follow us on

    Yashaswi Jaiswal : పేద కుటుంబం నుంచి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగి.. అద్భుతమైన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలి ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ జట్టు తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2018లో జరిగిన అండర్ -19 ప్రపంచ కప్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత క్రికెట్ లోకి తారాజువ్వలాగా దూసుకు వచ్చాడు. దేశవాళీ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.. అంతర్జాతీయ క్రికెట్ లోనూ అదే తీరుగా సత్తా చాటాడు. నిలకడగా ఆడుతూ స్టార్ ఆటగాడిగా ఆవిర్భవించాడు. త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు.

    ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ద్వారా..

    ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో యశస్వి జైస్వాల్ సెంచరీల మోత మోగించాడు. ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన యశస్వి… 16 ఇన్నింగ్స్ లలో 1,028 రన్స్ చేశాడు. అసాధారణమైన బ్యాటింగ్ తో టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం లాగా కనిపిస్తున్నాడు. అయితే ఈ ఆటగాడు ప్రస్తుతం ప్రేమలో పడ్డాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు యశస్వి జైస్వాల్ ఓ విదేశీ అమ్మాయితో సన్నితంగా ఉంటూ కనిపించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అది బలమైన కారణంగా మారింది. ఇంగ్లాండ్ దేశానికి చెందిన మాడీ హామిల్టన్ తో యశస్వీ సన్నిహితంగా ఉంటున్నాడు. మూడు సంవత్సరాలుగా వారిద్దరి మధ్య వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సమయంలో చెన్నై విమానాశ్రయంలో వీరిద్దరూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు జైస్వాల్ ఆడిన ఐపీఎల్ మ్యాచ్లకు హమిల్టన్ హాజరైంది. అయితే అతని ప్రేమకు సంబంధించి అనేక పుకార్లు వస్తున్నప్పటికీ ఇంతవరకు యశస్వి స్పందించలేదు. అలాగని ఖండించలేదు. మూడేళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. హమిల్టన్ ఇంగ్లాండ్ దేశంలో చదువుకుంటున్నది. ఇక ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఆడిన టెస్టు సిరీస్ మ్యాచ్ లకు హామిల్టన్ హజరైంది. అంతేకాదు బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్ ను ఉత్సాహపరిచింది..

    స్నేహితుడి సోదరినే

    ఇంగ్లాండ్ దేశానికి చెందిన హెన్రీ.. జై స్వాల్ కు మంచి స్నేహితుడు. అతడి సోదరే హమిల్టన్. ఇంగ్లాండ్ వెళ్ళిన ప్రతిసారి జైస్వాల్ హెన్రీ ఇంటిని సందర్శించేవాడు. దీంతో హమిల్టన్ కు జైస్వాల్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహానికి దారి చేసింది. చివరికి ప్రేమగా మారింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.