OTT : దర్శకుడు హరీష్ శంకర్-రవితేజ కాంబోలో వచ్చిన మూడో చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో వీరు షాక్, మిరపకాయ్ చిత్రాలు చేశారు. మిరపకాయ్ సూపర్ హిట్ గా నిలిచింది. చాలా గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ అంటూ ప్రేక్షకులను పలకరించారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దర్శకుడు హరీష్ శంకర్ విమర్శలపాలయ్యారు.
సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ పై నెగిటివిటీ నడిచింది. డైలాగ్స్ తో పాటు ఓ పాటలో రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నడుము పెట్టుకోవడాన్ని ప్రేక్షకులు తప్పుబట్టారు. విడుదలకు ముందు పరుష వ్యాఖ్యలు చేయడంతో హరీష్ శంకర్ ని ట్రోల్ చేశారు. అయితే మిస్టర్ బచ్చన్ నెగిటివిటీ నడిచినంత చెత్త చిత్రం కాదని సమాచారం. మిస్టర్ బచ్చన్ మూవీలో అలరించే అంశాలు ఉన్నాయి.
మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో మిస్టర్ బచ్చన్ స్ట్రీమ్ అవుతుంది. మిస్టర్ బచ్చన్ మూవీ కథ విషయానికి వస్తే… మిస్టర్ బచ్చన్(రవితేజ) నిజాయితీపరుడైన ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్. ఓ బడా వ్యాపారి మీద రైడ్ చేసి నల్లధనాన్ని వెలికి తీస్తాడు. మిస్టర్ బచ్చన్ పై కోపంతో ఆ వ్యాపారి తన పలుకుబడి ఉపయోగించి సస్పెండ్ చేయిస్తాడు. సస్పెండ్ అయిన మిస్టర్ బచ్చన్ తన సొంతూరికి వెళ్లి స్నేహితులతో పాటు ఆర్కెస్ట్రా రన్ చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో జిక్కీ(భాగ్యశ్రీ) బోర్సే ప్రేమలో పడతాడు. అనూహ్యంగా మిస్టర్ బచ్చన్ పై సస్పెన్షన్ ఎత్తేస్తారు. మళ్ళీ విధులకు హాజరైన మిస్టర్ బచ్చన్ బడా వ్యక్తి పై కన్నేస్తాడు. ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతిబాబు) తన జోలికి వచ్చిన చాలా మంది ఆఫీసర్స్ ని మట్టుబెడతాడు. ముత్యం జగ్గయ్య పై రవితేజ రైడ్ చేయాలి అనుకుంటాడు. జగ్గయ్యపై మిస్టర్ బచ్చన్ రైడ్ చేశాడా? జగ్గయ్య-మిస్టర్ బచ్చన్ మధ్య ఆధిపత్య పోరు ఎలా సాగింది? పై చేయి ఎవరిది అయ్యింది? అనేది మిగతా కథ..