MS Dhoni: మిస్టర్ కూల్.. ఎవరంటే క్రికెట్ అభిమానులు టక్కున చెప్పే పేరు మహేంద్రసింగ్ ధోని. ఎంత టెన్షన్ మ్యాచ్ అయినా.. కూల్‌గా గాడడం ధోని ప్రత్యేకత. ధోనికి కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అభిమానులు ధోని కోసం చూసిన సందర్భాలు అరుదు. అయితే తాజాగా గురువారం రాజస్తాన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనికి కోపం వచ్చింది. ఒక దశలో సహనం కూడా కోల్పోయాడు.
పరుగులు తీస్తున్నాడని రివ్యూ..
ఎంఎస్.ధోని రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాల్లో ఫలితం అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే తన మాస్టర్‌మైండ్‌తో ఆలోచించే ధోని రివ్యూ విషయంలో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలిసారి ధోని లెక్క తప్పింది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని.. యశస్వి జైశ్వాల్ విషయంలో రివ్యూకు వెళ్లాడు. తీక్షణ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతిని జైశ్వాల్ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. ఈ క్రమంలో బంతి అతని ప్యాడ్లను తాకి కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లింది. అంపైర్‌కు అప్పీల్ చేయగా స్పందన రాకపోవడంతో ధోని డీఆర్‌ఎస్ కోరాడు. అయితే అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకినప్పటికీ లెగ్‌స్టంప్ ఔట్‌సైడ్‌లో బంతి పిచ్ అయినట్లు చూపించింది. జైశ్వాల్ నాటౌట్ అని తేలగా.. సీఎస్‌కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైశ్వాల్ 11 బంతుల్లో 31 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. ఒక దశలో సీఎస్‌కే బౌలర్లపై ధోని అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే ధాటిగా ఆడుతున్నాడన్న కోపంతో రివ్యూకు పోయాడు.. కానీ ఏం లాభం చేతులు కాల్చుకున్నాడు.
2019లో ధోని ఉగ్రరూపం..
ఐపీఎల్ 16వ సీజన్‌లో గురువారం రాజస్తాన్ రాయల్స్, సీఎస్‌కే తలపడ్డాయి. సొంత గ్రౌండ్‌లో రాజస్తాన్ సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసి 202 పరుగులు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టార్గెట్ ముంగిట బోల్తాపడింది. ఈ మ్యాచ్‌లో ధోనీ కాస్త అసహనంగా కనిపించాడు. ఇదే జైపూర్‌లో 2019 ఐపీఎల్ సీజన్‌లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఎప్పుడు శాంతంగా.. కూల్‌గా కనిపించే ధోని ఇలా సహనం కోల్పోయి అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో ఆసక్తి రేపింది. మరోసారి నాలుగేళ్ల తర్వాత సీఎస్‌కే, రాజస్తాన్‌లు జైపూర్‌లో మ్యాచ్‌లోనూ ధోనీ కోపం కనిపించింది. జైపూర్ గ్రౌండ్‌లో ఆడితే ధోనీకి కోపం వస్తుందా.. ఇది జైపూర్ ప్రభావమా.. మైదానం ప్రభావమా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.