Yashasvi Jaiswal: 2023 -25 సంవత్సరాలకు సంబంధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కొనసాగుతోంది. ఈ ఛాంపియన్ షిప్ లో అరుదైన రికార్డు సృష్టించడానికి టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ 132 పరుగుల దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ జట్టుతో సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా టీమిండియా రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇప్పటికే తొలి టెస్ట్ కు సంబంధించి 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ నాయకత్వంలో ఈ జట్టు బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఈ జట్టులో యశస్వి జైస్వాల్ కూడా ఒకడు. అతడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ ప్రారంభిస్తాడని తెలుస్తోంది. 2023 -25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సీజన్ కు సంబంధించి యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు 1,028 పరుగులు చేశాడు. 22 సంవత్సరాల ఈ ఆటగాడు మరో 132 పరుగులు గనుక చేస్తే.. world test championship ఒకే ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్ గా ఆవిర్భవిస్తాడు.
అగ్రస్థానంలో రహానే
World test champion ship 2019-21 సీజన్ కు సంబంధించి భారత మాజీ ఆటగాడు అజింక్యా రహనే 1,159 పరుగులు చేశాడు. మరో 132 పరుగులు చేస్తే అతడి రికార్డును యశస్వి జైస్వాల్ అధిగమిస్తాడు. World test champion ship లో భాగంగా ఇప్పటివరకు రోహిత్, రహానే, యశస్వి మాత్రమే 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. 2023 – 25 world test champion ship స్కోరింగ్ చార్ట్ లో యశస్వి సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నాడు. అతడు ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్(1,028) తో కలిసి 12వ స్థానాన్ని పంచుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ 1,398 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్ ను అధిగమించాలంటే యశస్వి జైస్వాల్ కు మరో 371 పరుగులు కావాలి..
భారత్ తొలి స్థానం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ 68.52 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత.. స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్టులు.. ఆస్ట్రేలియాతో వారి స్వదేశంలో ఐదు టెస్టులు ఆడుతుంది. ఇక బంగ్లాదేశ్ కూడా టాప్ ఫామ్ కొనసాగిస్తోంది. పాకిస్తాన్ జట్టును 2-0 తేడాతో వైట్ వాష్ చేసి.. పాకిస్తాన్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ దక్కించుకుంది. టెస్టులలో పాకిస్తాన్ జట్టును తొలిసారిగా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇక రెండవ టెస్టులో పాకిస్తాన్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలి టెస్ట్ కు జట్లు ఇవే
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యష్ దయాల్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, గిల్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా.
బంగ్లాదేశ్
షాంటో(కెప్టెన్), జాకర్ అలీ అనిక్, ఖలీద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, నహీద్ మహమ్మద్ రసాన్, నయీద్ మహమ్మద్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీం, మేమినుల్ హక్, మహమ్మద్ హసన్ జాయ్, జకిర్ హసన్, షాదన్ ఇస్లాం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Yashaswi jaiswal is close to a rare feat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com