Yashasvi Jaiswal: టెస్ట్ కెరీర్ లోనే తొలి డబుల్ సెంచరీ.. యశస్వి పట్టుదల వెనుక కారణం అదే…

నిజానికి జైశ్వాల్ దూకుడు గా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అనే చెప్పాలి. ఇండియన్ ప్లేయర్లు ఎవ్వరూ చేయలేని ఒక అరుదైన ఘనతని తను సాధించి ఈ మ్యాచ్ లో మన టీమ్ కి భారీ స్కోర్ అందించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : February 3, 2024 11:41 am
Follow us on

Yashasvi Jaiswal: ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో సూపర్ గా ఆడుతున్నారు అనుకున్న ప్లేయార్లందరు చేతులెత్తేశారు. నార్మల్ గా ఆడుతాడు అనుకున్న జైశ్వాల్ మాత్రం డబుల్ సెంచరీ చేసి ఇండియన్ టీమ్ పరువు నిలబెట్టాడనే చెప్పాలి. ఇక 290 బంతుల్లో 7 సిక్స్ లు, 19 ఫోర్లతో 209 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో మొదటి సారి డబుల్ సెంచరీని సాధించడమే కాకుండా, అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన 3 వ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. తను సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు సిక్స్ కొట్టి సెంచరీని కంప్లీట్ చేస్తే, డబుల్ సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు మాటీమ్ ఏకం గా సిక్స్, ఫోర్ కొట్టి తన మొదటి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

నిజానికి జైశ్వాల్ దూకుడు గా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అనే చెప్పాలి. ఇండియన్ ప్లేయర్లు ఎవ్వరూ చేయలేని ఒక అరుదైన ఘనతని తను సాధించి ఈ మ్యాచ్ లో మన టీమ్ కి భారీ స్కోర్ అందించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…ఇక 22 ఏళ్ల కుర్రాడు ఇంగ్లాండ్ టీమ్ మొత్తానికి చెమటలు పట్టించాడు అంటే మామూలు విషయం కాదు. కెప్టెన్ రోహిత్ శర్మ జైశ్వాల్ మీద నమ్మకం ఉంచి తనను టీమ్ లోకి తీసుకొని అతన్ని ఓపెనర్ గా ఆడించి మంచి పని చేశాడు. అలాగే శుభ్ మన్ గిల్ లాంటి టాలెంటెడ్ బ్యాట్స్ మెన్ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి ఓపెనర్ గా టీమ్ లో కంటిన్యూ అవ్వాలి అంటే భారీ ఇన్నింగ్స్ లు ఆడక తప్పదు అని డిసైడ్ అయిన జైశ్వాల్ ప్రతిసారి భారీ స్కోర్ చేసే దిశగా ముందుకు కదులుతూ సక్సెస్ అవుతున్నాడు…

ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ పరువు నిలబెట్టడమే కాకుండా చేజారిపోయింది అనుకున్న మ్యాచ్ ను మళ్ళీ తీసుకువచ్చి మన చేతుల్లో పెట్టాడు. ఇక ఇండియన్ టీమ్ మొదటి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. మన బౌలర్లు ఎంత తొందరగా ఇంగ్లాండ్ ప్లేయర్లను ఔట్ చేస్తే అంత మంచిది…